Bollywood Actor Arjun Kapoor In Singham Series : సినీ నటులకు స్టార్డమ్ పెరగాలన్నా.. ఆఫర్లు క్యూ కట్టాలన్నా.. "సక్సెస్" కంపల్సరీ. అయితే.. కొందరి విషయంలో ఈ థియరీ అప్లై కాదు. సక్సెస్‌తో సంబంధం లేకుండా అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం.. మారిన పరిస్థితులే! గతంలో బాక్సాఫీస్ వద్ద సాధించిన హిట్లను బట్టే.. నెక్ట్స్ సినిమా అవకాశాలు ఉండేవి. కానీ.. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో.. ఆఫర్ల కొలతలు మారిపోయాయి. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ.. కంటిన్యూస్‌గా వార్తల్లో ఉంటే చాలు.. అవకాశాలు వాటంతట అవే వస్తున్నాయి! ఈ కారణంగానే.. ఒక్క హిట్లేకపోయినా కొందరు హీరో, హీరోయిన్లు వరుస ఛాన్సులు అందుకుంటూనే ఉన్నారు!
వరుసగా 9 డిజాస్టర్లు.. అయినా ఆఫర్లు..!
హిట్లు లేకున్నా అవకాశాలు అందుకుంటున్న వారిలో.. బీటౌన్ హీరో అర్జున్ కపూర్ ఒకరు. ఇతనో స్టార్ కిడ్. బాలీవుడ్లో వేళ్లూనుకున్న కుటుంబం అండతో ఇండస్ట్రీతో అడుగు పెట్టాడు. తొలి రెండు చిత్రాలు తప్ప.. ఆ తర్వాత ఒక్క సక్సెస్ కూడా టేస్ట్ చేయలేకపోయాడు. వరుసగా 9 డిజాస్టర్లు ఫేస్ చేశాడు. అయినా.. ఇతనికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే.. సగటు ప్రేక్షకుడికి ఇది నెపోటిజంలా అనిపించవచ్చు. కానీ కారణాలు వేరే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది జనం నోళ్లలో నానుతూ ఉండటమే!
పేరు చివర కపూర్‌తో పాటు తండ్రి, నిర్మాత బోనీ కపూర్, బాబాయిలు అనిల్, సంజయ్ కపూర్ నుంచి ఎంత సపోర్ట్ ఉన్నా.. హిట్ కొట్టడం మాత్రం అర్జున్‌కు సాధ్యం కావట్లేదు. అర్జున్తొలి సినిమా ఎటువంటి అంచనాలు లేకుండానే విడుదలై సక్సెస్ సాధించింది. రెండేళ్ల తర్వాత వచ్చిన మలి చిత్రం "2 స్టేట్స్" సూపర్ హిట్‌గా నిలిచింది. అర్జున్ సినిమాల్లో.. ఇప్పటివరకు చెప్పుకోదగింది ఇది మాత్రమే! ఆ తర్వాత ఒక్కటి కూడా థియేటర్లలో కనీస వసూళ్లకి నోచుకోలేదు. 2016 నుంచి ఇప్పటివరకు అర్జున్ కపూర్.. తొమ్మిది చిత్రాలలో నటించాడు. అవన్నీ బాక్సాఫీస్ వద్ద నీటిబుడగల్లా పేలిపోయాయి.
సల్మాన్ ఖాన్ 'టైగర్-3'కు మరాఠి సినిమా సవాల్! - డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసా?