తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​ 'ఆదిపురుష్​'పై భాజపా ఫైర్.. ఇష్టమొచ్చినట్టు చేస్తారా అంటూ...

టాలీవుడ్​ స్టార్​ హీరో ప్రభాస్​ నటిస్తున్న 'ఆదిపురుష్'​కు సంబంధించిన ఇటీవలే విడుదలైన టీజర్​పై మిశ్రమ స్పందన లభిస్తోంది. రావణుడిని చూపించిన తీరు పట్ల భాజపా అధికార ప్రతినిధి మాళవిక అవినాశ్​​ తీవ్రంగా మండిపడ్డారు. తెలుగులో వచ్చిన పౌరాణిక సినిమాల్లో రావణుడు ఎలా ఉన్నాడో ఓ సారి చూడాల్సిందంటూ.. దర్శకుడు ఓంరౌత్​పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

bjp slams adipurush director om raut for misrepresentation of ramayana
bjp slams adipurush director om raut for misrepresentation of ramayana

By

Published : Oct 4, 2022, 9:03 AM IST

BJP Fire On Adipurush : పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఇతిహాసగాథ 'ఆదిపురుష్‌'. రామాయణం ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. కృతిసనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు. సైఫ్ అలీఖాన్.. ప్రతినాయకుడు రావణాసురుడిగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటి హేమ మాలిని కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్​.. ఆదివారం సినిమా టీజర్​​ను అయోధ్యలో విడుదల చేసింది.

అయితే ఈ టీజర్​లో రావణుడి పాత్ర చూపించిన తీరు పట్ల దర్శకుడు ఓం రౌత్​పై భాజపా అధికార ప్రతినిధి మాళవిక అవినాశ్​​ తీవ్రంగా​ మండిపడ్డారు. "ఈ విషయంలో చాలా బాధగా ఉంది. బహుశా డైరెక్టర్​ ఓం రౌత్​.. వాల్మీకి రామాయణం, తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర ఎలా ఉంటుందో అధ్యయనం చేయలేదనుకుంటాను. కనీసం తెలుగు, తమిళంలో ఇదివరకు తెరకెక్కిన పౌరాణిక సినిమాల్లో రావణుడి పాత్ర ఎలా ఉందో పరిశీలించాల్సింది." అంటూ మళవిక సీరియస్​ అయ్యారు.

'భూకైలాస'లో సీనియర్ ఎన్టీఆర్​ లేదా సంపూర్ణ రామాయణంలో ఎస్వీ రంగారావు చేసిన రావణుడి పాత్రను చూసి అర్థం చేసుకోవచ్చు. టీజర్​లో రావణుడు నీలి కళ్లతో లెదర్​ జాకెట్​ వేసికున్నట్లు చూపించారు. స్వేచ్ఛా ముసుగులో చరిత్రను వక్రీకరించకూడదు. రామాయణం మన దేశ ప్రజల నాగరికతను కాపాడుతుంది. అలాంటి రామాయణాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలో రావణుడి పాత్రను వక్రీకరించనందుకు చాలా బాధగా ఉంది. "

-- మాళవిక అవినాశ్​, భాజపా అధికార ప్రతినిధి

సోమవారం ఉదయం.. ఆదిపురుష్​లో రావణుడిని చూపించిన తీరును విమర్శిస్తూ మాళవిక అవినాష్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. "లంకకు చెందిన ఒక శివ-భక్త బ్రాహ్మణుడైన రావణుడు 64 కళలలో ప్రావీణ్యం సంపాదించాడు! వైకుంఠపాలకులైన జయ విజయల శాపం కారణంగా రావణుడిగా అవతరించాడు! అయితే ఆదిపురుష్​లోని రావణుడు.. టర్కిష్ నిరంకుశుడిలా ఉన్నాడు! మన రామాయణం/చరిత్రను తప్పుగా చూపించడం ఆపండి! లెజెండ్ ఎన్​టీ రామారావు గురించి ఎప్పుడైనా విన్నారా?" అంటూ ట్వీట్​ చేశారు.

భాజపా అధికార ప్రతినిధి మాళవిక అవినాశ్​

అయితే ఆదిపురుష్ టీజర్ యానిమేటెడ్‌లా ఉందని, వీఎఫ్ఎక్స్ బాగోలేదని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇది నార్మల్ సినిమానా లేక బొమ్మల సినిమానా అని చాలామంది సందేహ పడుతున్నారు. రావణుడిని చూపించిన తీరుతో పాటు నెటిజన్లు పుష్పక విమానాన్ని చూపించిన తీరుపైనా మండిపడ్డారు. ఎంతో అందంగా ఉండే పుష్పక విమానాన్ని ఒక భయంకరమైన జీవి స్వారీ చేస్తున్నట్లు ఉందని సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

టీ సిరీస్​-రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'ఆదిపురుష్‌' వచ్చే ఏడాది సంకాంత్రి కానుకగా జనవరి 21న రిలీజ్​ చేయనున్నారు మేకర్లు. ఈ సినిమా మొత్తం బడ్జెట్‌ విలువ రూ.400 కోట్లు అని సమాచారం. దాదాపు 15 స్వదేశీ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:'అందుకే 'స్వాతిముత్యం' సినిమా ఒప్పుకున్నా.. ఆ రెండు పాత్రల్లో బాగా నటిస్తా!'

''గాడ్​ ఫాదర్'​లో పది సర్​ప్రైజ్​లు!.. త్వరలోనే నాగ్​-అఖిల్​తో యాక్షన్​ మల్టీస్టారర్​!'

ABOUT THE AUTHOR

...view details