Bipasha Basu Pregnancy: తన అందచందాలతో కుర్రకారును అల్లాడించింది హీరోయిన్ బిపాస బసు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కరణ్ సింగ్ గ్రోవర్‌తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. వీరిద్దరూ 'ఎలోన్' సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది.
ఆరేళ్లుగా ఎంతో అన్యోన్యంగా బిపాస, కరణ్ కలిసి జీవిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బిపాస తల్లి కాబోతుందంటూ ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. దీంతో అడ్వాన్స్‌గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.