KalyanRam Bimbisara: నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. ఆయన కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్రాజెక్ట్.. ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నటుడిగా తన ప్రస్థానాన్ని కల్యాణ్ గుర్తుచేస్తున్నారు. 'అప్ క్లోజ్ విత్ ఎన్. కె. ఆర్' పేరిట' ఓ వీడియోను పోస్ట్ చేశారు.
బాబాయ్ బాలయ్య చెప్పిన ఆ మాట వల్లే ఈ రోజు నేనిలా..: కల్యాణ్‌రామ్ - bimbisara movie updates
KalyanRam Bimbisara: బాబాయ్ బాలకృష్ణ.. నటనలో తనకు అక్షరాభ్యాసం చేశారని.. తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు హీరో కల్యాణ్ రామ్. ఆ సమయంలో బాలయ్య అన్న మాటలను తెలిపారు.
"నాకిప్పటికీ గుర్తుంది. అది 1989వ సంవత్సరం. 'అన్నయ్యా.. కల్యాణ్‌ని సినిమాల్లో పరిచయం చేస్తా' అని బాబాయ్ (బాలకృష్ణ) నాన్నని అడిగారు. అప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నా. చదువుపై శ్రద్ధ పెట్టకుండా పూర్తిగా సినిమాలవైపే మొగ్గుచూపుతానేమోనని నాన్న సందేహిస్తుంటే.. 'నేను చూసుకుంటా. మీరు ఎక్కువగా ఆలోచించొద్దు' అని బాబాయ్ అన్నారు. బాబాయే.. నటనలో నాకు అక్షరాభ్యాసం చేశారు. బాల నటుడిగా చేసిన తొలి సినిమా 'బాల గోపాలుడు'. నేను అప్పటివరకూ 'కెమెరా' ముందుకొచ్చింది లేదు. దర్శకుడు కాశీ విశ్వనాథ్ తెరకెక్కించిన, రామోజీరావు నిర్మించిన 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా పరిచయమయ్యా. ఆ తర్వాత ప్రయాణం గురించి మీ అందరికీ తెలిసిందే. నా తొలి రెండు చిత్రాలు ఆశించినంత విజయం అందుకోలేదు. ఆ సమయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. అప్పుడే నన్ను నేను నిరూపించుకోవాలనే కసి నాలో పెరిగింది. ఆ క్రమంలో వచ్చిందే 'అతనొక్కడే' చిత్రం. ఈ సినిమా నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. తర్వాతర్వాత, సినీ రంగంలోనూ సాంకేతికత వినియోగం బాగా పెరిగింది. హాలీవుడ్‌లో వచ్చే త్రీడీ సినిమాల స్ఫూర్తితో కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. అనుకున్నట్టుగానే 'ఓం: త్రీడీ' సినిమాను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశా. ఈ సినిమా కూడా నిరాశ పరిచింది. ఆ తర్వాతా, సినిమా మేకింగ్‌లో చాలా మార్పులొచ్చాయి. తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. 'బాహుబలి' పాన్ వరల్డ్ సినిమాగా మారింది. కొవిడ్ పాండమిక్ రావడంతో అంతా ప్రశ్నార్థకమైంది. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, లేదా? అనే సందేహం కలిగింది. 'ఆర్‌ఆర్‌ఆర్'తో అవన్నీ తొలగిపోయాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతంగా నటించారు" అని కల్యాణ్ తన మనసులో మాట పంచుకున్నారు. ఈ విశేషాలకు సంబంధించిన మరో ఎపిసోడ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.
ఇదీ చూడండి: వీఎఫ్ఎక్స్ స్పెషల్.. వందల రూ.కోట్ల బడ్జెట్‌తో రానున్న బిగ్ ప్రాజెక్ట్స్!