నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'బింబిసార'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఓటీటీలో కూడా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకున్నారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చిత్రబృందం గతంలో ప్రకటించింది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు వశిష్ట మాట్లాడారు.
"సోషియో ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బింబిసార చిత్రాన్ని అందరూ ఎంతగానో ఆదరించారు. ఊహించని విజయాన్ని అందించారు. ప్రస్తుతం వాళ్లందరూ ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. నేను అభిమానులందరికీ కొత్తదనాన్ని ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను రూపొందించనున్నాం. మొదటిభాగం భారీ హిట్ సాధించినందున రెండో భాగం దానికి మించి తీయాలనే ఒత్తిడి నాపై ఉంది. కల్యాణ్ రామ్ తన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బింబిసార2 సినిమా షూటింగ్ మొదలవుతుంది" అని చెప్పారు.