Bimbisara 2 update : వరుస పరాజయాలతో సతమతమవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్‌కు.. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది టైమ్ ట్రావెల్ అండ్ ఫాంటసీ ఫిల్మ్ 'బింబిసార'. దీంతో రెండో భాగాన్ని తెరకెక్కిస్తామని కూడా ప్రకటించారు. ప్రముఖ జీ సంస్థ కూడా.. ఈ సెకండ్ పార్ట్‌కు సంబంధించిన అన్ని రైట్స్ కోసం రూ.వంద కోట్లు ఆఫర్ చేసిందట. దీంతో ఈ సినిమాను త్వరగా మూగించాలని కల్యాణ్ రామ్ నిర్ణయించుకున్నారట. ఇలాంటి సమయంలో ఆయనకు ఓ పెద్ద చిక్కు వచ్చి పడిందని తెలిసింది. చిత్ర దర్శకుడు వశిష్ట.. ఈ రెండో భాగం ప్రస్తుతానికి చేసేందుకు ఆసక్తిగా లేరని ప్రచరాం సాగుతోంది.
చిరంజీవి సినిమా కోసమేనా? వశిష్ట.. మెగాస్టార్ చిరంజీవికి ఓ కథ చెప్పి ఒప్పించారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమానే ఆయన తన రెండో చిత్రంగా రూపొందించాలని భావిస్తున్నారట. ఇది వర్కౌట్ అయితే ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్చరణ్తోనూ ఓ సినిమా చేయొచ్చని భావనలో ఉన్నారట. అందుకే 'బింబిసార 2'ను కొంతకాలం పక్కనపెట్టి.. ముందుగా చిరంజీవితోనే చేయాలని డిసైట్ అయ్యారట. అయితే ఈ నిర్ణయంపై కల్యాణ్ రామ్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. అవసరమైతే మరో దర్శకుడితోనైనా ఈ చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యారట. 'రొమాంటిక్' ఫేమ్ అనిల్ పాడురికు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట.
40 శాతం రెమ్యునరేషన్ కోత.. దర్శకుడు వశిష్ట.. తన సెకండ్ మూవీగా 'బింబిసార 2'ను.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేస్తానని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారంట. ఒకవేళ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో కాకుండా తన రెండో సినిమాను(బింబిసార 2 కాకుండా) ఇతర నిర్మాణ సంస్థలో చేస్తే.. 'బింబిసార 2' కోసం తీసుకునే రెమ్యునరేషన్లో 40 శాతం వదులుకునేలా అగ్రీమెంట్ చేసుకుని సంతకం చేశారట.