Chiru 154 Biju menon: మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కాంబోలో రూపొందుతున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మాస్ కథాంశంతో సిద్ధమవుతున్న ఈ మూవీలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. రవితేజ, బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో విలన్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు. సముద్రఖని, విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా కనిపిస్తారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ప్రముఖ మలయాళ నటుడు బిజూ మీనన్‌ను తీసుకోవాలని మూవీటీమ్ భావిస్తోందట. తెలుగులో బిజూ.. 'ఖతర్నాక్', 'రణం' సినిమాలు చేశారు. టాలీవుడ్లో ఈయన పెద్దగా ఫేమస్ కానప్పటికీ.. మాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 'అయ్యప్పన్ కోషియమ్' సినిమాతో బిజూ రేంజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఆయన్ను మళ్లీ టాలీవుడ్‌కు తీసుకురావాలని 'మెగా 154' టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇక ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రానుంది.
చిరుకు విలన్‌గా మలయాళ నటుడు!.. 'ప్రాజెక్ట్ కె' టీమ్‌కు ప్రభాస్ స్పెషల్ పార్టీ - ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్యలో ప్రతినాయకుడిగా ప్రముఖ మలయాళ నటుడు బిజూ మీనన్ నటిస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు హీరో ప్రభాస్.. ప్రాజెక్ట్ కె మూవీటీమ్‌కు స్పెషల్ పార్టీ ఇచ్చినట్లు ఓ వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పార్టీలో అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, నాగ్ అశ్విన్ సహా తదితురులు పాల్గొన్నారు.
Prabhas Project K Party: పాన్ఇండియా ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన 'ప్రాజెక్ట్ కె' మూవీటీమ్‌కు ఓ స్పెషల్ పార్టీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పార్టీలో అమితాబ్ బచ్చన్, దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు.. 'సలార్', 'ఆదిపురుష్'లతో త్వరలోనే అభిమానుల ముందుకు రానున్నారు.
ఇదీ చూడండి: 'ఏం మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది'.. హీరో గోపీచంద్ భావోద్వేగం