Bigg Boss Telugu 7 Wild Card Entries :బిగ్ బాస్ 7వ సీజన్.. "ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఇంకో లెక్క.. అంతా ఉల్టా పల్టా" అన్నారు. దీంతో జనాల్లో ఒక క్యూరియాసిటీ మాత్రం క్రియేట్ చేయగలిగారు. కానీ.. దాన్ని పర్ఫెక్ట్గా కొనసాగిస్తున్నారా? అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. ఇప్పటి దాకా ఐదుగురు హౌస్ నుంచి బ్యాగ్ సర్దేశారు. అయితే.. వీరంతా లేడీసే కావడం గమనార్హం. ఒక్క మేల్ కంటిస్టెంట్ కూడా ఎలిమినేట్ కాలేదు. పోనీ.. వెళ్లిన వారిలో అందరూ పూర్ క్యాండిడేట్సేనా అంటే అదీ కాదు. చివరి వరకూ పోటీ ఇవ్వగలదు రతిక లాంటి వారు కూడా ఎలిమినేట్ అయిపోవడంతో ఆడియెన్స్‌కు షాక్ తగిలింది.
Bigg Boss Telugu 7 Season 2.0 :ఈ ఆదివారం డబుల్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒకేసారి ఇద్దరిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. వారిలో ఒకరు శుభశ్రీ కాగా.. మరొకరు గౌతమ్ కృష్ణ. ఈ డబుల్ ఎలిమినేషన్‌ను ఎవ్వరూ ఊహించలేదు. అయితే.. ఆ వెంటనే మరో ట్విస్ట్ ఇవ్వడం విశేషం. గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్‌లోకి పంపేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ 7 సీజన్ 2.0ను అనౌన్స్ చేసేశాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి కొత్త వాళ్లు వస్తున్నట్టు ప్రకటించాడు.
Bigg Boss Subhashree : బిగ్‌బాస్ హౌస్ నుంచి క్యూటీ ఔట్.. 5వారాలకు ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా?
Five Members With Wild Card Entry in to Bigg Boss Telugu 7 :ఇలా వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినవాళ్లు ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా ఐదుగురు ఉన్నారు. ఇంత మందిని మధ్యలో హౌస్‌లోకి పంపిస్తున్నామని చెప్పడం ద్వారా ఆడియెన్స్‌లో మరోసారి క్యూరియాసిటీ పెంచారు. కానీ.. ఆ వచ్చిన వాళ్లను చూసిన తర్వాత నీరుగారిపోయామని స్వయంగా ఫ్యాన్సే సోషల్ మీడియా వేదికగా చర్చ చేస్తున్నారు. ఎవరెవర్నో తీసుకొచ్చి హౌస్‌లో వదిలారంటూ బిగ్‌బాస్ పై సెటైర్లు వేస్తున్నారు. హీరో కార్తి ఫేమస్ మీమ్ "ఎవర్రా మీరంతా" ఫొటోను వాడుతూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన వాళ్లపై కామెంట్స్ చేస్తున్నారు.