తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామ్​చరణ్​ మూవీలో బిగ్​బాస్​ కంటెస్టెంట్​ కీలక పాత్ర- అనౌన్స్​ చేసిన డైరెక్టర్! - రామ్​చరణ్ బుచ్చిబాబు సినిమా ఆర్​సీ16

Game Changer Movie Bigg Boss Content : ప్రముఖ కథానాయకుడు మెగా పవర్​ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా.. ఉప్పెన ఫేమ్​ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆర్​16 అనే వర్కింగ్ టైటిల్​తో రూపొందుతోన్న ఈ సినిమాలో బిగ్​బాస్ షోలోని ఓ​ కంటెస్టెంట్​ కీలక పాత్ర చేయనున్నట్లు దర్శకుడు ప్రకటించారు. ఇంతకీ ఆ బిగ్​బాస్​ కంటెస్టెంట్​ ఎవరంటే?

Game Changer Movie Bigg Boss Content
Game Changer Movie Bigg Boss Content

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 6:58 AM IST

Updated : Nov 13, 2023, 9:10 AM IST

Game Changer Movie Bigg Boss Content :మెగా పవర్ స్టార్ నటుడు రామ్‌ చరణ్‌ ప్రస్తుతం శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్​ ఛేంజర్​ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్​ బచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా సైన్​ చేశారు. #ఆర్​సీ16 వర్కింగ్​ టైటిల్​తో తెరకుక్కున్న ఈ సినిమా గురించి మరో అప్​డేట్​ ఇచ్చారు డైరెక్టర్​ బుచ్చిబాబు. ఈ సినిమాలో బిబ్​బాస్ 7​ కంటెస్టెంట్​ అంబటి అర్జున్‌ కీలక రోల్​ చేస్తున్నారని చెప్పారు. తన ప్రతిభను మెచ్చిన బుచ్చిబాబు అర్జున్​ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. దీపావళి సందర్భంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన బుచ్చిబాబు.. అర్జున్‌ ఆట తీరును మెచ్చుకున్నారు.

Game Changer Movie Update :తన కోసం వచ్చినందుకు బుచ్చిబాబుకు కృతజ్ఞతలు తెలిపారు అర్జున్​. ఈ సందర్భంగా మాట్లాడారు. 'మీ ఉప్పెన సినిమాకు అవార్డు వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి రెండు మూడుసార్లు ఆఫీస్‌కు వచ్చాను. కానీ మీరు చెన్నై వెళ్లారని చెప్పారు. ఫోన్‌ చేద్దామనుకున్నా కుదరలేకపోయింది. ఈలోగా ఉన్నపలంగా బిగ్​బాస్​కు రావాల్సి వచ్చింది' అని అర్జున్‌ అన్నారు. దీనిపై స్పందించిన బుచ్చిబాబు.. 'రామ్‌ చరణ్‌ సర్‌ మూవీలో నువ్వొక సూపర్‌ పాత్ర చేయబోతున్నావ్‌. ఫిక్స్‌ అయిపో' అంటూ పండగ వేళ అర్జున్‌కి ఊహించని సర్​ప్రైజ్​ ఇచ్చారు. దీంతో అర్జున్‌ నందంలో మునిగిపోయారు. అంతేకాకుండా ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్​ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ పనిచేస్తున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. దీంతో బిగ్​బాస్​ కంటెస్టెంట్లు అందరూ కేరింతలు కొట్టారు. అనంతరం 'మీ తొలి చిత్రంలాగానే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్‌ అవ్వాలి. ఇంకో నాలుగైదు అవార్డులూ గెలవాలి' అని అర్జున్‌ ఆకాంక్షించారు. 'బుచ్చిబాబు అన్న ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఇంకో పది మూవీలు పెద్ద హిట్‌ అయినా, ఆయన చాలా కూల్‌గా ఉంటారు. ఎవరు వచ్చిన గౌరవంగా మాట్లాడతారు' అని అర్జున్‌ కొనియాడారు.

అంబటి అర్జున్‌కు నటన కొత్తేమీకాదు. ఆయన ఇప్పటికే పలు సీరియల్​లతో బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. 'అర్ధనారి', 'సుందరి' వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. గోపీచంద్‌ హీరోగా వచ్చిన 'సౌఖ్యం'లో విలన్‌గానూ నటించారు. 'ఉప్పెన'తో తొలి ప్రయత్నంలోనే బ్లాక్​బస్టర్​ హిట్​ అందుకున్న బుచ్చిబాబు.. కొన్ని నెలల క్రితమే రామ్‌ చరణ్‌తో చిత్రాన్ని ప్రకటించారు. క్రీడా నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్​ వివరాలను ఇంకా వెల్లడించలేదు.

తారల దీపావళి మెరుపులు - ట్రెడిషనల్​ ఔట్​ఫిట్స్​లో ఎవరూ తగ్గేదేలే

ఫ్రేమ్​ అదిరింది, మెగా ఇంట్లో దీపావళి సందడి- తళుక్కుమన్న టాలీవుడ్​ తారలు

Last Updated : Nov 13, 2023, 9:10 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details