Bigg Boss 7 Telugu Promo : తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' త్వరలో ఏడో సీజన్‌తో మన ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఆరు సీజన్లతో సందడి చేసిన ఈ పాపులర్ షో.. ఇంకొన్ని రోజుల్లో ప్రసారం కానుంది. మంగళవారం దీనికి సంబంధిన తాజా ప్రోమో ఒకటి విడుదలైంది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో, ప్రోగ్రాం హోస్ట్ అక్కినేని నాగార్జున కనిపించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ సారి రొటీన్‌కు భిన్నంగా ఓ కొత్త కాన్సెప్ట్‌తో రానున్నట్లు ఆయన ఓ హింట్ ఇచ్చారు. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటూ ఈ షో పై ఆడియన్స్‌కు మరింత ఆసక్తి పెంచారు.
మరింత కొత్తగా 'బిగ్‌బాస్ 7'.. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్'.. - బిగ్ బాస్7 తెలుగు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్
Bigg Boss 7 Telugu Promo : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున వ్యాఖాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌బాస్' మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుని త్వరలో ఏడవ సీజన్‌తో సందడి చేయనుంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ప్రోమో ఆడియెన్స్‌లో అంచనాలను పెంచేస్తోంది. మీరు కూడా దాన్ని చూసేయండి మరి..
Bigg Boss 7 Host : అయితే గతంలో 'బిగ్‌బాస్ 7' తెరపైకి రానున్న నేపథ్యంలో ఈ సీజన్‌కు ఎవరు హోస్ట్‌గా వ్యవహరించనున్నారన్న విషయంపై పలు రూమర్స్ వెలువడ్డాయి. గత సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున.. ఈ సీజన్‌కు రాకపోవచ్చన్న వార్తలు సైతం నెట్టింట హల్చల్ చేశాయి. అయితే వాటన్నింటికి ఈ తాజా ప్రోమోతో చెక్ పెట్టినట్లు అయ్యింది. మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా చేయగా.. 3, 4, 5, 6 సీజన్లకు నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించి, అలరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా వచ్చి సందడి చేయనున్న విషయం కన్ఫార్మ్ అయ్యింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రముఖ ఓటీటీ ఛానల్ 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్' లోనూ స్ట్రీమింగ్ కానుంది.
కంటెస్టంట్స్ ఎవరంటే..
ఈ సీజన్లో శ్వేతా నాయుడు, యాంకర్ ధనుశ్, కార్తిక దీపం ఫేమ్ శోభితా శెట్టి.. ఈ సారి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ కూడా రానున్నారని సమాచారం. అసలు వీరు గత సీజన్లోనే వస్తారని ప్రచారం సాగింది. కానీ ఆ సమయంలో అది కుదరలేదట. దీంతో ఈ సీజన్‌కు గట్టి ప్లాన్స్ చేస్తున్నారని టాక్. ఇక ఇటీవలే బాగా పాపులరైన ఆట సందీప్, జ్యోతి జంట కూడా ఈ సీజన్లో కనిపించనున్నారట.