bigg boss 7 telugu 5th week eliminations :బిగ్ బాస్ 7లో ఏం జరుగుతోందో ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. మెజారిటీ జనాలు అనుకుంటున్నది ఒకటి.. హౌస్‌లో జరుగుతున్నది మరొకటి. రతిక ఇంత త్వరగా హౌస్ నుంచి బయటికి వెళ్తుందని ఎవరైనా అనుకున్నారా..? మాగ్జిమమ్ నో అనే సమాధానమే వస్తుంది. కానీ.. ఊహించని విధంగా ఆమె హౌస్ నుంచి వెళ్లిపోయింది. ఈ హఠాత్పరిణామంతో.. ఆమె ఫ్యాన్స్ నీరుగారిపోయారు. ఈ షాక్ నుంచే కోలుకోకుండానే.. ఇప్పుడు మరో షాక్ ఇచ్చేందుకు బిగ్ బాస్ సిద్ధంగా ఉన్నారని టాక్.
ఇప్పటి వరకూ జరిగిన ఆరు సీజన్లలో ఎప్పుడూ జరగని విషయం ఈ సీజన్లో జరుగుతోంది. ఓపెనింగ్ లో చెప్పిన ఉల్టాపల్టాకు అర్థం ఏంటో తెలియలేదు గానీ.. ఇప్పటి వరకూ ఎలిమినేట్ అయిపోయినవారంతా ఆడవాళ్లే..! ఇప్పుడు ఐదో వారం కూడా వెళ్లిపోయేది లేడీ కంటిస్టెంటే అన్నది సోషల్ మీడియాలో గట్టిగా సాగుతున్న చర్చ..! ఇలా బ్యూటీస్ అంతా హౌస్ నుంచి వెళ్లిపోతే.. బొత్తిగా కలరింగ్ లేకుండా పోతుందయ్యా బిగ్గు బాసూ.. అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక నామినేషన్స్ విషయానికి వస్తే.. ఇప్పుడు హౌస్‌లో శివాజీ, ప్రశాంత్, సందీప్, అమర్ దీప్, యావర్, గౌతమ్ కృష్ణ, తేజ, శుభశ్రీ, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నారు. వీరిలో పవర్ అస్త్ర కారణంగా.. శోభాశెట్టి, సందీప్, ప్రశాంత్ నామినేషన్లో లేరు. వీరుపోగా.. మిగిలిన ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు.
Bigg Boss Rathika Rose Remuneration : 4 వారాలకు రతిక గట్టిగానే తీసుకుందిగా!.. ఏకంగా ఎన్ని లక్షలంటే?