Bigg Boss 7 Telugu 6th Week Eliminations :మొదట ఉల్టా పల్టా అంటూ స్టార్ట్ అయిన బిగ్ బాస్ 7వ సీజన్.. అక్టోబర్ 8న జరిగిన మినీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా 2.0గా మారాక.. మరింత ఆసక్తికరంగా మారింది. మొదట హౌజ్‌లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. వారి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఐదు వారాల ఎలిమినేషన్స్‌లో వరుసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్,శుభ శ్రీ రాయగురు(Shubhashree) బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయారు. ఇక ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో ఐదుగురు కొత్త వారు హౌజ్‌లోకి అడుగుపెట్టారు.
Bigg Boss 7 Telugu 6th Week Voting Poll :ప్రస్తుతం హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారిని ఆటగాళ్లు, పోటుగాళ్లుగా నాగార్జున విభజించారు. వీరికి కెప్టెన్సీ కోసం టాస్కులు పెడుతూ.. గేమ్‌ను రసవత్తరంగా మార్చేశారు. హౌజ్‌లోకి కొత్తగా వచ్చిన వారికి పవర్స్ ఇచ్చి.. పాతవాళ్లను బిగ్‌బాస్ ఓ రేంజ్లో ఆడుకున్నాడు. ఇక నామినేషన్స్ అంటూ ఈ రెండు టీమ్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్.. వరుస టాస్కులతో ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్(Bigg Boss Telugu 7) ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ జరగ్గా.. అందులో ఏడుగురు ఈ వారం నామినేట్ అయ్యారు. వారిలో ప్రిన్స్ యావర్, అమర్దీప్ చౌదరి, టేస్టీ తేజ, అశ్విని శ్రీ, నయని పావని, పూజా మూర్తి, శోభా శెట్టి ఉన్నారు. అయితే.. వీరితోపాటు మొదట సందీప్ కూడా నామినేట్ అయ్యాడు. కానీ, సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన గౌతమ్ తనకు ఇచ్చిన పవర్ ద్వారా ఇతన్ని సేవ్ చేశాడు.