Sohel Mr Pregnant Trailer : బిగ్‌బాస్ ఫేమ్ సొహెల్ నటించిన ప్రయోగాత్మక చిత్రం ప్రెగ్నెంట్ ట్రైలర్. టైటిల్‌తోనే ఆసక్తిని పెంచిన ఈ సినిమా ఎన్నో కష్టాలను దాటుకోని ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్స్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ ప్రచార చిత్రాన్ని అక్కినేని నాగార్జున రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మొత్తం ఫన్ అండ్ ఎమోషన్స్‌తో సాగింది.
ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే ఓ కుర్రాడు.. ప్రేమ, పెళ్లి అంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేలోపు అతడి జీవితం ఓ ఊహించని మలుపు తిరుగుతంది. ఓ మగాడు గర్భం దాలిస్తే.. అతడు ఎలాంటి అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే వినూత్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ప్రచార చిత్రంలో చూపించారు.
'నా పేరు గౌతమ్. నాది మంచి క్రేజీ లైఫ్.. ఓ క్రేజీ గర్ల్ ఫ్రెండ్' అంటూ సొహెల్ చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత 'ఇది అందరి లైఫ్‌లో ఉండేదే బ్రో.. కానీ నా లైఫ్‌లో ఓ ట్విస్ట్' అంటూ సొహెల్ ప్రెగ్నెంట్ అవడం, దాంతో అతడు ఎదుర్కొన్న అవమానాలను, ఇబ్బందులు వంటి సన్నివేశాలతో ట్రైలర్‌ను కట్ చేశారు.