తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రాజెక్ట్-K షూటింగ్​లో అమితాబ్​కు తీవ్రగాయాలు.. విరిగిన పక్కటెముక - అమితాబ్​ బచ్చన్​ ప్రాజెక్ట్​ కె ప్రమాదం

ప్రాజెక్ట్​-కె షూటింగ్​లో బాలీవుడ్​ స్టార్​ నటుడు అమితాబ్​ బచ్చన్​ తీవ్రంగా గాయపడ్డారు. తన కుడి పక్కటెముక విరిగినట్లు.. కోలుకోవడానికి మరికొన్ని వారాలు పడుతుందని ఆయన తెలిపారు.

bigb Amitabh Bachchan severly injured in project k shooting in hyderabad
bigb Amitabh Bachchan severly injured in project k shooting in hyderabad

By

Published : Mar 6, 2023, 10:15 AM IST

Updated : Mar 6, 2023, 10:39 AM IST

బాలీవుడ్​ స్టార్​ నటుడు అమితాబ్​ బచ్చన్​ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాజెక్ట్​-కె సినిమాలో భాగంగా పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆయన గాయాలపాలయ్యారు. హైదరాబాద్​లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. తన స్వగృహానికి చేరుకున్నారు. కోలుకోవడానికి ఇంకొన్ని వారాల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఈ ఘటన మార్చి 4న జరిగినట్లు సమాచారం.

"హైదరాబాద్‌లో ప్రాజెక్ట్- కె షూటింగ్‌లో భాగంగా యాక్షన్ షాట్ సమయంలో గాయపడ్డాను. దీంతో కుడి పక్కటెముక విరిగింది. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లోని సీటీ స్కాన్​ తీయించుకున్నాను. షూట్​ రద్దు చేసుకుని డాక్టర్​ను సంప్రదించి చికిత్స పొందాను. ప్రస్తుతం ముంబయిలోని జల్సాలో విశ్రాంతి తీసుకుంటున్నాను. డాక్టర్లు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. ప్రస్తుతం ఊపిరి తీసుకునేటప్పుడు నొప్పిగా ఉంది. ఈ రోజు సాయంత్రం ఎవరూ నన్ను కలవడానికి రావొద్దు" అని అమితాబ్ బచ్చన్ బ్లాగ్​లో వెల్లడించారు.

అమితాబ్​ గాయపడ్డారన్న వార్త తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే ప్రాజెక్ట్​-కె సినిమా రిలీజ్​ డేట్​ను చిత్రబృందం ఇటీవలే తెలిపింది. 2024 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా రిలీజ్​ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అమితాబ్​ గాయపడినందున సినిమా విడుదల మళ్లీ వాయిదా పడుతుందని నెటిజన్లు అంటున్నారు.

ప్రాజెక్ట్​-కెలో పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ సరసన బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె ఆడిపాడనుంది. బాలీవుడ్​ బిగ్​ బీ అమితాబ్​ బచ్చన్​ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ కనువిందు చేయనుంది. మహానటి ఫేమ్​ డెరెక్టర్​ నాగ్​ అశ్విన్​ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్​లో సుదీర్ఘమైన అయిదు యాక్షన్‌ బ్లాకులు ఉన్నట్లు సమాచారం.

Last Updated : Mar 6, 2023, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details