తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సుప్రీం కోర్టులో 'కాంతార' టీమ్​కు ఊరట.. ఆ పని చేయాల్సిన అవసరం లేదంటూ.. - kantara varaha roopam

'కాంతార' చిత్రబృందానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. 'వరాహ రూపం..' పాటను సినిమా నుంచి తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అంతే కాకుండా దర్శకుడు రిషబ్‌ శెట్టి, నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌కు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించింది.

kantara varaha roopam
kantara varaha roopam song

By

Published : Feb 10, 2023, 3:07 PM IST

కన్నడ చిత్రం 'కాంతార' మూవీ టీమ్​కు సుప్రీం కోర్టు ఊరట కలిగించింది. 'వరాహ రూపం..' పాటను ప్రదర్శించకూడదని కేరళ హైకోర్టు విధించిన షరతును సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. చిత్ర నిర్మాతలు ఈ పాటను సినిమా నుంచి తొలగించాల్సిన అవసరం లేదని మధ్యంతర ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు పేర్కొంది. 'కాంతార' చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్​తో పాటు హీరో రిషబ్ శెట్టికి ముందస్తు బెయిల్​ను మంజూరు చేసింది. అంతే కాకుండా కేసు విషయమై ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వారిద్దరూ విచారణకు హాజరైనప్పుడు వారిని అరెస్టు చేయరాదని పోలీసులను కోర్టు ఆదేశించింది.

అసలేం జరిగిందంటే ?
తమ పాట బాణీని కాపీ కొట్టారంటూ కాంతర టీమ్​పై కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్​ బ్యాండ్ ఆరోపణలు చేసింది. అనంతరం కోర్టును ఆశ్రయించి 'వరాహ రూపం..' పాట ప్రదర్శనను నిలివేయాలని పిటిషన్​ దాఖలు చేసింది. వారి కేసును పరిశీలించిన కోర్టు థియేటర్లలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పాటను ప్లే చేయడాన్నినిలిపివేయాలని మేకర్స్‌ను ఆదేశించింది. ఆ తర్వాత, కేరళలోని కోజికోడ్ జిల్లా న్యాయస్థానం అధికార పరిధి లేకపోవడంతో 'వరాహ రూపం' పాటపై నిషేధాన్నిఎత్తివేసింది.

కాగా, కన్నడ సినిమా 'కాంతార' రిలీజైన కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకుంది. సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా మూవీలోని 'వరాహ రూపం..' సాంగ్​ సినిమాకే హైలైట్​గా నిలిచింది. థియేటర్​లో ఈ పాట వచ్చినప్పుడు ప్రేక్షకులు తన్మయత్వంలో మునిగితేలారు. 'భూతకోలా' ఘట్టాన్ని స్వయంగా చూసిన అనుభూతి కలిగిందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details