Bhola Shankar Teaser : మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన 'భోళా శంకర్' టీజర్‌ను మూవీ యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. దర్శకుడు మెహర్ రమేశ్.. ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ జోనర్‌గా రూపొందించారు. ఇందులో చిరంజీవి క్యాబ్ డ్రైవర్‌గా కనిపించనున్నారు. టీజర్‌ను పూర్తిగా మాస్, యాక్షన్‌తో అంశాలతో నింపేశారు. 'షికారుకు వచ్చిన షేర్' అంటూ తెలంగాణ యాసలో చిరు పలికిన డైలాగ్.. టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. 'స్టేట్ డివైడ్ అయినా.. అంతా నా వాళ్లే', 'మనకు హద్దుల్లేవ్, సరిహద్దుల్లేవ్' అంటూ చెప్పిన డైలాగ్స్‌కు విజిల్స్ పడాల్సిందే. కాగా, మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
వాల్తేరు వీరయ్య అంటూ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి హిట్ అందుకున్న చిరు.. ఈసారి పక్కా తెలంగాణ యాసలో ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. టీజర్ చూస్తే.. సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని తెలుస్తోంది. సంగీతానికి ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యముందని గతంలో చిత్రబృందం తెలిపిన నేపథ్యంలో.. తాజా టీజర్లో ముఖ్యంగా ఫైట్ సీన్స్‌లో మహతి స్వర సాగర్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిచారు. కాగా ఇప్పటికే ఆయా సందర్భాల్లో విడుదల చేసిన సినిమా పోస్టర్, లిరికల్ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ చూసిన చిరంజీవి అభిమానులు ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
కాగా తమిళంలో అజిత్ కుమార్సూపర్ హిట్ మూవీ 'వేదాళం' కు రీమేక్‌గా 'భోళా శంకర్' రూపుదిద్దుకుంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్.. చిరుకు చెల్లెలి పాత్రలో నటిస్తోంది. అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ కథ.. అన్నాచెల్లెళ్ల అనుబంధాల నేపథ్యంలో ఉండనుంది. డైరెక్టర్ మెహర్ రమేశ్ కథలో స్వల్ప మార్పులతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు.
చిరంజీవి ఇదివరకే చాలా సినిమాల్లో కార్మికుడి పాత్రలో నటించి మంచి మార్కులు సంపాదించారు. ఘరానా మొగుడు, ముఠామేస్త్రీ లాంటి సినిమాల్లో ఆయన నటనకు ఇప్పటికి క్రేజ్ ఏ మాత్రమూ తగ్గలేదు. చిరు కెరీర్లో ఆ పాత్రలకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంది. ఇక తాజాగా భోళా శంకర్‌లో కూడా అలాంటి మాస్ పాత్రలోనే చిరు కనిపిస్తుండడం.. సినిమాపై అంచానాలు పెంచేస్తోంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ మ్యూజికల్ స్పెషలిస్ట్ మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. ఎడిటింగ్ బాధ్యతలు మార్తాండ్ కె వెంకటేశ్ నిర్వర్తిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
సినిమాలో రఘు బాబు, రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.