మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సర్‌ప్రైజ్‌ల వెల్లువ మొదలైంది. సోమవారం చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా 'భోళా శంకర్' టీమ్ నుంచి అప్‌డేట్ వచ్చేసింది. చిరు, కీర్తి సురేశ్ అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ షేర్ చేసింది. ఇందులో చిరు బ్లాక్ అండ్ వైట్ దుస్తులు, కళ్లద్దాలు ధరించి స్టైలిష్, యంగ్ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈపోస్టర్ అభిమానులతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.
ఆ హిట్ సినిమాకు రీమేక్‌గా..
తమిళంలో సూపర్‌హిట్ సొంతం చేసుకున్న 'వేదాళం' రీమేక్‌గా 'భోళా శంకర్' రూపుదిద్దుకుంటోంది. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో ఇది తెరకెక్కుతోంది. మెహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.