Bhola shankar Overseas Collection : మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్' భారీ డిజాస్టర్ టాక్‌ను అందుకుంది. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఆ స్థాయిలో మళ్లీ భోళాశంకర్ ఆ రిజల్ట్‌ను అందుకుంది. దీంతో సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా ట్రోల్సే కనపడుతున్నాయి. ఈ సినిమా పట్ల మెగా ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియెన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ మొదటి రోజు ఆశించిన స్థాయిలోనూ కలెక్షన్లను అందుకోలేకపోయింది. తాజాగా యఎస్ఏ వసూళ్ల వివరాలు బయటకు వచ్చాయి.
Bhola Shankar USA Premiere Collection : చిరు గత సినిమా వాల్తేరు వీరయ్య.. ఓవర్సీస్ యూఎస్ఏలో ప్రీమియర్స్ ద్వారా 679కె డాలర్స్‌ను అందుకోగా.. మొత్తం థియేట్రికల్ రన్ టైమ్ పూర్తయ్యేసరికి 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్లను వసూలు చేసింది. అయితే భోళాశంకర్ మాత్రం ప్రీమియర్స్ ద్వారా 303కే డాలర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే వాల్తేరు వీరయ్య వసూళ్లలో సగం. ఇక మొదటి రోజు కేవలం 82కే డాలర్లను మాత్రమే అందుకోగా.. మొత్తంగా ప్రీమియర్స్-ఫస్ట్ డే కలిపి 358కే డాలర్స్‌ను వసూలు చేసింది.
దీంతో ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీస్ ముందు తొలి వీకెండ్లో 600కే డాలర్ల మార్క్‌ను అందుకోవడం కష్టమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తం సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యేలోగా ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ మార్క్‌ను చేరుకోవడం అసాధ్యమని చెబుతున్నాయి. అంతకుముందు భారీ డిజాస్టర్‌ను అందుకున్న ఆచార్య.. యూఎస్ఏలో టోటల్ థియేట్రికల్ రన్ టైమ్‌లో 985కె డాలర్లను వసూలు చేసింది.