తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Bhola Shankar Kushi Scene : 'ఖుషి'లో భూమిక నడుము అందం సీక్రెట్ తెలుసా? - భోళాశంకర్ శ్రీముఖి నడుము సీన్​ ట్రోల్స్​

Bhola Shankar Kushi Scene : మెగాస్టార్​ చిరంజీవి భోళాశంకర్ సినిమాలో చిరు-శ్రీముఖి నడుము సీన్​పై నెట్టింట్లో ట్రోల్స్​ తెగ వస్తున్నాయి. దీంతో ఖుషి సినిమాలోని పవన్-భూమిక నడుము సీన్ కూడా నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. మరి భూమిక నడుము అందం వెనక ఉన్న సీక్రెట్ తెలుసా?

Bhola Shankar Kushi Scene
Bhola Shankar Kushi Scene : 'ఖుషి'లో భూమిక నడుము అందం సీక్రెట్ తెలుసా?

By

Published : Aug 12, 2023, 8:16 PM IST

Bhola Shankar Kushi Scene : మెగాస్టార్​ చిరంజీవి భోళాశంకర్ సినిమా డివైడ్ టాక్​ను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగానూ ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది. అయితే ఈ చిత్రంలో చిరు.. తన తమ్ముడు పవన్ కల్యాణ్ మేనరిజాన్ని, ఆయన సీన్స్​ను రీక్రియేట్ చేశారు. ఇందులో ఖుషి సినిమాలోని భూమిక నడుము సీన్​ను యాంకర్ శ్రీముఖితో రీక్రియేట్​ చేశారు.

Kushi Bhumika Nadumu scene : అయితే ఈ నడుము సీన్​ బెడిసి కొట్టింది. దీంతో ఈ సీన్​పై సోషల్ మీడియాలో ఫుల్​ ట్రోల్స్ వస్తున్నాయి. పవన్ స్వాగ్ చిరు మ్యాచ్ చేయలేరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్​-భూమిక సీన్ కూడా నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అయితే భూమిక నడుము అందం వెనుక ఓ సీక్రెట్ ఉందట. భూమిక నడుము అందానికి అసలు కారణం.. ఆమె తీసుకునే స్పెషల్ డైట్ అని తెలిసింది. పండ్లు, కూరగాయయలు, మిల్లెట్స్ వంటివి భూమిక ఎక్కువగా తినేదట. రోజంతా నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఆమె శరీరం కూడా హైడ్రేట్​గా గ్లోగా ఉండేదట. రోజూ వ్యాయమం కూడా చేసేదట. అలా రోజు పాటించడంతో ఆమె నడుము అందంగా కనిపించేదని బయట కథనాల్లో రాసి ఉంది.

ఇంకా భూమిక ఫిట్నెస్ సీక్రెట్ గురించి కూడా తెలిసింది. స్విమ్మింగ్, యోగా చేయడంతో పాటు ప్రతి రాత్రి 7-9 గంటల పాటు నిద్రపోతుందని తెలిసింది. అందుకే ఆమె అందంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుందట. చర్మసౌందర్యానికి కూడా సహజ పద్దతుల్లో తయారు చేసిన వాటినే వినియోగిస్తుందటని తెలిసింది. అలా భూమిక ఫిట్​నెస్​తో పాటు నడుమును బాగా మెయిన్​టెయిన్ చేసి యూత్ హృదయాలను కొట్టకొట్టిందట.

ఇకపోతే భూమిక అసలు పేరు రచనా చావ్లా. గుడియా అని కూడా పిలుస్తుంటారు. 'యువకుడు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఖుషీ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి నటించింది. సెకండ్ ఇన్నింగ్స్​లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. చివరిగా సీతారామం, బటర్ ఫ్లైలో నటించింది. హిందీలో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో కనిపించింది.

Bhola shankar Overseas Collection : 'భోళాశంకర్' ఓవర్సీస్​ కలెక్షన్స్ మరీ ఇంత దారుణమా​.. 'వాల్తేరు వీరయ్య'లో సగం

Jailer and Bhola shankar : చిరుకు షాక్​.. ఇకపై 'భోళాశంకర్'​ థియేటర్లలో రజనీ 'జైలర్​'!

ABOUT THE AUTHOR

...view details