Bhola Shankar Hindi Version :టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్'. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం మిశ్రమ ఫలితాలు అందుకుని థియేటర్లలో రన్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ సరికొత్త అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు హిందీలోనూ రానుంది. అయితే రీమేక్‌గా కాకుండా ఈ సినిమా హిందీ వెర్షన్లో విడుదల కానుంది. అక్కడ కూడా 'భోళా శంకర్' అనే పేరుతోనే ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ విషయాన్ని హిందీ డబ్బింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసిన ఆర్‌కేడీ స్టూడియోస్ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా హిందీ వెర్షన్ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి పాత్రకు బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పారు.
Bhola Shankar Hindi Version : బీటౌన్లోకి 'భోళాశంకర్' ఎంట్రీ.. ఆ స్టార్ హీరో సహాయంతో.. - Bhola Shankar movie release
Bhola Shankar Hindi Version : మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'. తమన్న, కీర్తి సురేశ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో హిందీలోనూ విడుదల కానుందట. ఇంతకీ ఎప్పుడంటే ?
మరోవైపు తెలుగులో రిలీజయ్యేందుకు ముందే ఈ సినిమాను హిందీలోకి డబ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అందుకుగానూ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆర్‌కేడీ స్టూడియోస్‌కు 'భోళాశంకర్' థియేట్రికల్ రైట్స్‌ను తెలుగు మేకర్స్ ఇచ్చారట. అయితే ఆగస్ట్ 11న తెలుగుతో పాటు హిందీలోనూ 'భోళాశంకర్'ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ ఆలస్యమైనందున ఇప్పుడు ఆగస్ట్ 25న 'భోళాశంకర్' హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chiranjeevi Bhola Shankar Cast :ఇక సినిమా విషయానికి వస్తే.. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ 'వేదాళం'కు రీమేక్‌గా 'భోళాశంకర్' తెరకెక్కింది. ఇందులో చిరంజీవి సరసన మిల్క్ బ్యూటీ తమన్నా నటించగా.. ఆయన సోదరిగా కీర్తి సురేశ్ మెరిశారు. హీరో సుశాంత్, రఘుబాబు, రవిశంకర్, మురళీ శర్మ, రష్మీ గౌతమ్ వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.