Bhola shankar Chiranjeevi craze : మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఇప్పటికీ కొనసాగుతూ.. యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. ఆయన్నే ఆదర్శంగా తీసుకుని సినీ పరిశ్రమలోకి వచ్చిన ఎంతో మంది హీరోలు, నటీనటులు ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ, విదేశాల్లోనూ మెగాస్టార్ చిరంజీవికి భారీగా అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా చైనాలో జరిగిన ఓ సంఘటన మెగాస్టార్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తుంది.
అదేంటంటే.. చైనా రాజధాని బీజింగ్ దగ్గరలోని జంజు 26 అనే గవర్నమెంట్ మిడిల్ స్కూల్లో.. ఓ టీచర్ స్టూడెంట్స్‌కు ప్రజెంటేషన్ ఇవ్వమని అడిగారు. 'మీకు నచ్చిన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి ఓ ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఇవ్వండి' అని ఆ టీజర్ ఓ అసైన్మెంట్ ఇచ్చారు. అయితే ఆ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జిస్మిత అనే విద్యార్థిని.. మెగాస్టార్ చిరంజీవి మీద ఓ ఆడియో విజువల్ ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే ఆ విద్యార్థి మాటలు విన్న టీజర్ ఆశ్చర్యపోయారట.
'చిరంజీవి ఎవరు?' అని ఆ టీచర్ అడిగారట. అప్పుడా విద్యార్థి మెగాస్టార్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసి చూపించిందట. వాస్తవానికి అక్కడ భారతీయులను ఇలాంటివి చెప్పడానికి అనుమతించరని తెలిసింది. కానీ.. జిస్మిత చెప్పిన మాటలు, సమాచారం గురించి అక్కడి టీచర్ విని ఆశ్చర్యపోయారట. అలా జిస్మిత మెగాస్టార్ చిరంజీవి గురించి దాదాపు 5 నిమిషాల పాటు విజువల్ ప్రజెంటేషన్ ఇచ్చిందట. తరగతి గదిలో అనర్గళంగా మాట్లాడిందట. దీంతో అక్కడ ఉన్నవారంతా జిస్మితను చప్పట్లతో అభినందించారు.