తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Bhola Shankar Break Even : భోళాజీ​ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్​.. చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇదే లోయెస్ట్‌! - భోళాశంకర్​ మూవీ లేటెస్ట్ అప్డేట్స్​

Bhola Shankar Break Even Target : మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంక‌ర్' మూవీ.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా బ్రేక్​ ఈవెన్​ టార్గెట్​ ఎంతంటే?

Bhola Shankar movie
Chiranjeevi Bhola Shankar movie

By

Published : Aug 9, 2023, 12:40 PM IST

Bhola Shankar Break Even Target: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త్వరలో 'భోళాశంకర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మెహర్​ రమేశ్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. త‌మిళ స్టార్ హీరో అజిత్​ నటించిన సూపర్​ హిట్​ మూవీ 'వేదాళం'కు రీమేక్‌గా 'భోళాశంక‌ర్' తెర‌కెక్కుతోంది.

అయితే సిస్టర్​ సెంటిమెంట్​తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.80 కోట్లకు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్లు స‌మాచారం. నైజాంలో సుమారు రూ.22 కోట్ల వ‌ర‌కు ఈ మూవీ థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాల టాక్​. ఉత్త‌రాంధ్ర‌లో రూ.10 కోట్ల‌ు, సీడెడ్‌లో రూ.12 కోట్లుకు మేర థియేట్రిక‌ల్ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు సమాచారం.

ఓవర్సీస్​లో చిరుకు ఉన్న క్రేజ్​తో అక్కడ ఈ సినిమాకు రూ.7 కోట్ల వ‌ర‌కు బిజినెస్ వచ్చినట్లు తెలిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.70 కోట్ల వ‌ర‌కు 'భోళాశంకర్‌' ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిందట. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో 'భోళాశంక‌ర్' రిలీజ్ అవుతున్నట్లు తెలిసింది.

Bhola Shankar Pre Release Business : చిరంజీవి గ‌త సినిమా 'వాల్తేర్ వీర‌య్య' రూ.90 కోట్లు, 'ఆచార్య' రూ.95 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరోవైపు చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లో 'సైరా న‌ర‌సింహారెడ్డి' థియేట్రిక‌ల్ రైట్స్ అత్య‌ధికంగా 180 కోట్ల‌కు అమ్ముడుపోయాయి. అయితే వాటితో పోలిస్తే 'భోళాశంక‌ర్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ త‌క్కువ కావ‌డం గ‌మ‌నార్హం. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో అతి త‌క్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో 'భోళాశంక‌ర్' మూవీ రిలీజ్ అవుతోంది. అయితే రీమేక్ మూవీ కావ‌డమే ప్రీ రిలీజ్ బిజినెస్ త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని స‌మాచారం.

ట్రైలర్​లో మాస్​ ఎలిమెంట్స్​.. సిస్టర్​ సెంటిమెంట్​ కూడా..
Bhola Shankar Trailer : తాజాగా విడుదలైన 'భోళాశంకర్'​ ట్రైలర్​ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరు పంచ్‌ డైలాగ్స్‌, ఎక్స్​ప్రెషన్స్​.. కీర్తి సురేశ్‌ నటనతో ఈ ట్రైలర్‌ ఆద్యంతం సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. సోదరి సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎమెషన్స్​తో పాటు యాక్షన్​ కూడా కావాల్సినంత ఉందని తాజాగా విడుదలైన ట్రైలర్​తో నిరూపితమైంది. సినిమాలోని పాటలకు కూడా ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు

Bhola Shankar Movie Cast : ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్క్​ బ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తుండగా.. ఆయన సోద‌రిగా కీర్తి సురేశ్​ మెరిశారు. హీరో సుశాంత్, రఘుబాబు, రవిశంకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర ఈ మూవీకి నిర్మాతగా వ్యహరిస్తుండగా..మహతి స్వరసాగర్​ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

'భోళా శంకర్' సెట్స్‌లో కీర్తి గొంతు పట్టుకున్న చిరు?.. మెగాస్టార్​ క్లారిటీ ఇదిగో!

'చిరు క్షమిస్తే.. పవన్ వడ్డీతో తిరిగిచ్చేస్తాడు.. మెగా ఫ్యామిలీని ఎవడైనా అంటే కుర్చీ మడతపెట్టి..'

ABOUT THE AUTHOR

...view details