తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కమల్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. మళ్లీ సెట్స్​పైకి భారతీయుడు-2.. RC15 షూట్​కు బ్రేక్! - undefined

కమల్‌ - శంకర్‌ కలయికలో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం భారతీయుడు-2. ఇప్పటికే దాదాపు 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పలు కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడా సమస్యలన్నీ తొలిగిపోగా.. మళ్లీ షూటింగ్ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు.

bharateeyudu 2 movie
కమల్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. మళ్లీ సెట్స్​పైకి భారతీయుడు-2

By

Published : Aug 5, 2022, 7:11 AM IST

కమల్‌హాసన్‌ - శంకర్‌ల క్రేజీ ప్రాజెక్ట్‌ 'భారతీయుడు 2' తిరిగి పట్టాలెక్కుతోంది. వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కాజల్‌ అగర్వాల్‌ స్వయంగా వెల్లడించింది. ఆమె ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే కొన్నాళ్లుగా చిత్రీకరణలకు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తన వెండితెర రీఎంట్రీపై స్పష్టత ఇస్తూ.. 'భారతీయుడు 2' షూటింగ్‌ కబురును పంచుకుంది. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌ 13న తిరిగి ప్రారంభమవుతుందని.. ఈ షెడ్యూల్‌తోనే తాను తిరిగి సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నాని వెల్లడించింది.

కమల్‌ - శంకర్‌ కలయికలోనే వచ్చిన 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే దాదాపు 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పలు కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడా సమస్యలన్నీ తొలగడంతో తిరిగి చిత్రీకరణ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడీ సినిమా తిరిగి మొదలవుతున్న నేపథ్యంలో శంకర్‌ - రామ్‌చరణ్‌ల కలయికలో రూపొందుతున్న 'ఆర్‌సి15' (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రీకరణ కొన్నాళ్లు ఆగనున్నట్లు తెలుస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details