This week release movies: వరుసగా భారీ సినిమాలు విడుదలవుతుండటంతో చిన్న సినిమాలన్నీ తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఎట్టకేలకు మే మొదటివారంలో ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి వస్తున్నాయి.
Srivishnu Bhala tandanana movie release date: శ్రీవిష్ణు కథానాయకుడిగా వారాహి చలన చిత్రం పతాకంపై తెరకెక్కిన సినిమా 'భళా తందనాన'. కేథరిన్ కథానాయిక. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. రజనీ కొర్రపాటి నిర్మాత. సాయి కొర్రపాటి సమర్పకులు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామచంద్రరాజు, శ్రీనివాస్‌రెడ్డి, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Suma Jayamma panchayati movie release date: తన యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు నటి సుమ. అప్పుడప్పుడు వెండితెరపై తళుక్కున మెరిసినా, పూర్తిస్థాయి పాత్రను ఇప్పటివరకూ పోషించలేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'జయమ్మ పంచాయతీ'. విజయ్ కుమార్ కలివరపు దర్శకుడు. మే 6న ఈ సినిమా విడుదల కానుంది. పల్లెటూరి డ్రామాగా రూపొందిన చిత్రమిది. ఎవరికీ.. దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళ పాత్రలో సుమ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించటం విశేషం. దినేష్, షాలిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాశ్ నిర్మిస్తున్నారు.
Viswaksen new movie release date: విశ్వక్‌సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా మే 6నే రిలీజ్ కానుంది. పెళ్లి చూపులకని గోదావరి జిల్లాలోని ఓ ఊరికి వెళ్లి 33ఏళ్ల అర్జున్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆడ పెళ్లి వాళ్ల నుంచి ఎలాంటి మర్యాదలు అందాయి? అనుకోని పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Keerthy suresh Chinni movie: కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోన్న కీర్తి సురేశ్ ఇప్పుడు ఓ విభిన్న పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. సెల్వరాఘవన్‌తో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం 'చిన్ని'. అరుణ్ మథేశ్వరం దర్శకుడు. పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసిన చిన్ని అనే యువతి రంగయ్యతో కలిసి 24 హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఇంతకీ రంగయ్యకు, చిన్నికీ ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మే 6న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ప్రైమ్ వీడియో వేదికగా ‘చిన్ని’ స్ట్రీమింగ్ కానుంది.