Bhagwant Kesari Balakrishna : వయసకు తగ్గ పాత్రలు చెయ్యాల్సిన సమయం వచ్చేసిందని మన టాలీవుడ్ సూపర్ సీనియర్ హీరోలకు కూడా అర్థమైపోయింది! యంగ్ హీరోయిన్లతో డ్యాన్స్‌లు, రొమాన్స్‌లు.. పక్కన పెట్టి కథా బలమున్న సినిమాల్లోనే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. రీసెంట్‌గా చిరంజీవి 'భోళా శంకర్' సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఈ చర్చ కూడా మరింత ఎక్కువ అయిపోయింది.
ఇతర ఇండస్ట్రీలో నుంచి రీసెంట్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సినిమాలు కమల్ హాసన్ 'విక్రమ్', రజనీకాంత్ 'జైలర్', షారుక్ ఖాన్ 'జవాన్' ఇప్పటికే ఈ విషయాన్ని నిరూపించాయి. కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలో తన వయసుకు తగ్గ పాత్రలో.. కొడుకును హత్య చేసిన వారిపై పగతీర్చుకునే తండ్రిగా, ప్రత్యర్థుల నుంచి మనవడిని కాపాడుకునే తాతయ్యగా కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన లుక్, నటన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వెళ్లిపోయారు కమల్ హాసన్.
సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇదే ట్రై చేసి విజయాన్ని అందుకున్నారు. ఆయన గత కొంత కాలంగా తన మార్క్ సక్సెస్‌ను సొంతం చేసుకోలేకపోయారు. అయితే ఆ లోటును 'జైలర్' సినిమాతో తీర్చుకున్నారు. అప్పటి వరకు హీరోయిన్లతో రొమాన్స్ చేసిన రజనీ.. జైలర్‌లో మాత్రం వయసుకు తగ్గ పాత్రలో తండ్రిగా, తాతగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది.