తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Bhagvant Kesari vs Leo : బాలయ్యా మజాకా.. ఆ రాష్ట్రంలో ఫ్యాన్స్ క్రేజీ సెలబ్రేషన్స్​​.. ఏ హీరోకూ ఇలా చేయలేదబ్బా! - Bhagvant Kesari Twitter Review

Bhagvant Kesari vs Leo Celebrations : బాలకృష్ణ భగవంత్ కేసరి, దళపతి విజయ్ నటించిన లియో సినిమాలు ఈ రోజులు విడుదలైయ్యాయి. ఈ సందర్భంగా అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. దీన్ని ఓ పండగలా సెలెబ్రేట్ చేస్తున్నారు. అయితే బాలయ్య అభిమానులు చేసిన ఓ పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Bhagvant Kesari vs Leo Celebrations : బాలయ్య బాబు స్పెషల్ సెలెబ్రేషన్స్.. ఇలా ఎవరికి చేసి ఉండరెయో.!
Bhagvant Kesari vs Leo Celebrations : బాలయ్య బాబు స్పెషల్ సెలెబ్రేషన్స్.. ఇలా ఎవరికి చేసి ఉండరెయో.!

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 12:01 PM IST

Bhagvant Kesari vs Leo Celebrations : సాధారణంగా స్టార్ హీరో సినిమా విడుదల అవుతుంటే ఆ రోజు థియేటర్ల దగ్గర అభిమానులు చేసే రచ్చ మాములుగా ఉండదు. పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి అభిషేకాలు చేస్తూ.. పండగ వాతావరణంలాగా మార్చేస్తారు అభిమానులు. విజిల్స్​, అరుపులతో గోల గోల చేస్తూ.. థియేటర్లు మోత మోగేలా రీసౌండ్ చేస్తారు.తాజాగా బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి', దళపతి విజయ్ 'లియో' సినిమాలు నేడు (అక్టోబరు 19) ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా ఇద్దరి స్టార్​ హీరోల అభిమానులు ఇటు టాలీవుడ్​లో, అటు కోలీవుడ్​లో థియేటర్ల దగ్గర రచ్చ రచ్చ చేస్తున్నారు. అన్ని థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. స్క్రీన్స్​ ముందు ఓ పండుగలా సెలెబ్రేట్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు వీడియోసు నెటింట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

అయితే 'భగవంత్ కేసరి' విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు చేసిన వినూత్నమైన పని నెట్టింట మరింత ఎక్కువ ట్రెండ్ అవుతోంది. బాలయ్య బాబు అభిమానులు ఏకంగా మందు బాటిళ్లతో బాలయ్య ఫెక్సీలకు అభిషేకం చేశారు. అది ఎక్కడంటే.. బెంగళూరులోని వినాయక థియేటర్​లో జరిగింది. బాలయ్య బాబు పోస్టర్​కు ముందు బాటిళ్లతో అభిషేకం చేసి కొబ్బరికాయతో హారతి ఇచ్చారు. ఇక విజయ్​ అభిమానులు కూడా ఎక్కడ తగ్గట్లేదు. పాలాభిషేకాలు చేస్తూ పోస్టర్లకు పూల దండలు వేసి డ్యాన్స్​లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇకపోతే అనుకున్న విధంగానే ఈ రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. భగవంత్ కేసరి ఫుల్ పాజిటివ్​ టాక్​తో దూసుకుపోతుండగా.. లియో మాత్రం కాస్త మిక్స్​డ్​ టాక్​ను కూడా తెచ్చుకుంది. బాలయ్య సినిమా ఫ్యామిలి ఆడియెన్స్​కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉందని.. బాలయ్య హ్యాట్రిక్ హిట్ అందుకున్నారని రివ్యూలు వస్తున్నాయి. 'లియో'కు డిసెంట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సెకండ్ హాఫ్​ కొంచెం నిరాశపరిచిందని అంటున్నారు. ప్రస్తుతానికైతే.. షోలన్నీ హౌస్​పుల్​గా ప్రదర్శితమవుతున్నాయి. మరి రేపు(అక్టోబర్​ 20) రిలీజ్ కానున్న టైగర్​ నాగేశ్వరరావు, టైగర్ ష్రాఫ్​ గణపత్ ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటాయో.

Bhagvant Kesari Twitter Review బాలయ్య హ్యాట్రిక్​.. ప్రతీ ఆడపిల్ల చూడాల్సిన సినిమా!

Leo Movie OTT Details : 'లియో' ఓటీటీ డీటెయిల్స్​ లీక్!.. అంత త్వరగా స్ట్రీమింగా?.. ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details