తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Bhagvant Kesari Twitter Review బాలయ్య హ్యాట్రిక్​.. ప్రతీ ఆడపిల్ల చూడాల్సిన సినిమా! - Bhagvant Kesari ticket bookings

Bhagvant Kesari Twitter Review : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' సినిమా రిలీజై పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంది. ఈ సినిమా ట్విట్టర్​ రివ్యూ గురించి తెలుసుకుందాం..

.
.

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 7:06 AM IST

Updated : Oct 19, 2023, 7:37 AM IST

Bhagvant Kesari Twitter Review : గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. అందాల భామ కాజల్ అగర్వాల్, గ్లామర్ క్వీన్ శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్​ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు థియేటర్ల వద్ద భారీ సంఖ్యలో చేరుకుని పండగ చేసుకుంటున్నారు. బాలయ్య డైలాగ్స్​, యాక్షన్​, ఎమోషనల్​ సీన్స్​తో థియేటర్లన్నీ దద్దరిల్లుతున్నాయి. బాలయ్య హ్యాట్రిక్ కొట్టేశారని అంటున్నారు. చిన్నతనంలోనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటివి నేర్పించాలనే మెసేజ్​తో ఫ్యామిలీ ఆడియెన్స్​కు​ కూడా బాగా కనెక్ట్ అయ్యేలా సినిమా ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఫస్ట్​​ హాప్​ సాఫీగా వెళ్లిపోతుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని అంటున్నారు. యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయట. సెకండ్ ఆఫ్ ఎమోషన్స్​తో మాస్ ఎంటర్‌టైనర్​గా కొనసాగిందని చెబుతున్నారు. సినిమాలో బాలయ్య-శ్రీలీల యాక్టింగ్​ హైలైట్​ అని కామెంట్లు వినపడుతున్నాయి. అయితే బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​పై మాత్రం కాస్త నెగటివ్​ రివ్యూలు కనిపిస్తున్నాయి. మొత్తంగా బాలయ్య అభిమానులకు ఈ సినిమా ఒక పండగేనట. ప్రతి అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి చూడాల్సిన సినిమా అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.

స్క్రీన్​ మీద బాలయ్య - శ్రీలీల కెమిస్ట్రీ పండింది. స్క్రీన్ మీద ఈ ఇద్దరు నిజమైన తండ్రికూతురు అనే ఫీలింగ్‌ను కలిగించారు. ఆఫ్ స్క్రీన్ కూడా వీరిది బెస్ట్ కాంబినేషన్. భావోద్వేగాన్ని రగిలించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీ భగవంత్ కేసరి అంటూ ఒకరు ట్వీట్ చేశారు.

భగవంత్ కేసరిని దర్శకుడు అనిల్​ రావిపూడి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. అభిమానులకు పంచభక్షపరమాన్నంలా ఉంది. ప్రతీ 15 నిమిషాలకు ఓ సర్‌ప్రైజ్​ ఉంటుంది. టీ వేడి చేసే సీన్‌లో బాలయ్య మంచి కామెడీ పండించారు. టన్నెల్ సీన్‌ అయితే సినిమాకే హైలెట్‌గా ఉంది అంటూ మరో నెటిజన్​ చెప్పారు.

Leo Movie Twitter Review : విజయ్​ 'లియో' రివ్యూ.. లోకేశ్​ మ్యాజిక్​ చేశాడా లేదా?

Last Updated : Oct 19, 2023, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details