Bhagvant Kesari Movie Good Touch Bad Touch Scene : నందమూరి బాలకృష్ణ దర్శకత్వం వహించిన 'భగవంత కేసరి' బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్ఫుల్గా నడుస్తోంది. బాలయ్య యాక్టింగ్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని తండ్రీ కూతురుగా బాలయ్య - శ్రీలీల ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకుల మనసును బాగా తాకుతోంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం గురించి నెట్టింట ఓ చర్చ జరుగుతోంది. అభిమానులు సినిమాలోని ఉన్న ఓ సన్నివేశాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. అదే 'గుడ్ టాచ్ బ్యాడ్ ట చ్'. దీని గురించి బాలయ్య చిన్నారులకు అద్భుతంగా వివరించారు.
'పాపా.. నీకు వాడు చాక్లెట్ ఇచ్చి నీ మీద చేతులేస్తుంటే అది తప్పని తెలియదా? - స్కూల్ యూనిఫాంలో ఉన్న ఐదేళ్ల చిన్నారిని అడుగుతాడు భగవంత్ కేసరి.
'ఊహూ..' అని అమాయకంగా చెబుతుంది ఆ పసిపాప చాక్లెట్ తింటూనే...
అలా వేయరాని చోట చెయ్యి వేస్తే తప్పని ఆ చిన్నారికి ఎవరో ఒకరు చెబితేనే కదా తెలిసేది.
మరి ఎవరు చెప్పాలి. ఇంట్లో అమ్మ లేదా స్కూల్లో టీచర్. కానీ, వాళ్లు చెప్పడం లేదు. చెప్పాలని కూడా చాలా మందికి తెలియదు. కొందరికి చెప్పాలని ఉన్నా ఎలా చెప్పాలన్న సంశయంతో ఆగిపోతున్నారు.
అభంశుభం తెలియని చిన్నపిల్లలపై మేకవన్నె పులుల్లాంటి కొందరు మానవ మృగాలు చేస్తున్న అకృత్యాల గురించి విని తల్లిదండ్రులు ఉలిక్కి పడుతున్నారే తప్ప తమ బిడ్డలకు జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం, ధైర్యం చేయడం లేదు.