Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : మరో మూడు నాలుగు రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు త్రిముఖ పోరు కనపడనుంది. బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్ లియో.. ఒక్క రోజులో రిలీజ్ కానున్నాయి. అయితే ఈ పోటీపై బాలయ్య - రవితేజ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. డబ్బింగ్ సినిమా లియో గురించి కాస్త పక్కనపెడితే.. తెలుగు చిత్రసీమలో భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావు మధ్య పోటీగానే అందరూ చూస్తున్నారు. రెండు మూవీటీమ్స్ కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాయి. ఈవెంట్లు నిర్వహిస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నాయి.
Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : బాక్సాఫీస్ పోటీపై బాలయ్య అలా.. రవితేజ ఇలా.. కామెంట్స్ వైరల్ - భగవంత్ కేసరి వర్సెస్ టైగర్ నాగేశ్వరరావు
Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పోటీపడటంపై బాలయ్య - రవితేజ మాట్లాడారు. తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
![Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : బాక్సాఫీస్ పోటీపై బాలయ్య అలా.. రవితేజ ఇలా.. కామెంట్స్ వైరల్ Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : బాక్సాఫీస్ పోటీపై బాలయ్య అలా.. రవితేజ ఇలా.. కామెంట్స్ వైరల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-10-2023/1200-675-19778298-thumbnail-16x9-bala-vs-rav.jpg)
Published : Oct 16, 2023, 12:41 PM IST
తాజాగా టైగర్ నాగేశ్వరరావు మూవీటీమ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ సందర్భంగా దసరా పండక్కు బాక్సాఫీస్ వద్ద నెలకొన్న వార్ గురించి రవితేజ మాట్లాడారు. తన పాన్ ఇండియా చిత్రంతో పాటు రిలీజ్ కానున్న ఇతర సినిమాలకు బెస్ట్ విషెస్ తెలిపారు. "నా బ్రదర్ లాంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా, మా బాలయ్య బాబు సినిమా భగవంత్ కేసరి కూడా విడుదల అవుతోంది. రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సమయంలో విజయ్ లియో కూడా మంచి సక్సెస్‌ను అందుకోవాలని ఆశిస్తున్నాను." అని పేర్కొన్నారు.
అంతకుముందు పోటీ గురించి ప్రెస్ మీట్లో బాలయ్య కూడా మాట్లాడారు. "ఛాలెంజ్.. పోటీ లేనిదే ఏ రంగంలోనూ ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. అయినా మాకు మేమే పోటీ. నాకు ఎవరూ పోటీ లేరు. ఎవరినీ పట్టించుకోను. నా సినిమాలు నాకే పోటీ." అని అనడం కాస్త ఘాటుగా అనిపించిందని కొందరు అన్నారు. అయినా ఆయన సందర్భానికి తగ్గట్టుగానే పాజిటివ్ వైబ్‌లో మాట్లాడారు. తన సినిమా తనకే పోటీ అనే అన్నారు తప్ప... ఎవరినీ కించపరచలేదు అని మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలోనూ వీరిద్దరు అన్‌స్టాపబుల్ షోలో కలిసి ఎంత సరదాగా మాట్లాడుకున్నారో తెలిసిందే.