Bhagavanth Kesari Movie Collections :నందమూరి నటసింహాం బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన 'భగవంత్ కేసరి'. అటు టాక్ పరంగానే కాకుండా ఇటు కలెక్షన్ల పరంగానూ ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకున్న ఈ చిత్రం ఆ తర్వాత కూడా అదే రేంజ్లో వసూళ్లను అందుకుంటూ రికార్డులను బ్రేక్ చేస్తోంది. దసరా పండుగతో పాటు వీకెండ్ రావడం వల్ల మూవీ లవర్స్ థియేటర్లకు బారులు తీశారు. దీంతో కలెక్షన్స్ కూడా అమాంతం పెరిగిపోయింది.
ఈ క్రమంలో ఐదో రోజు ఏపీ/ తెలంగాణలో రూ.8.6 కోట్లు, తమిళనాడులో రూ. 0.09 కోట్లు, కర్ణాటకలో రూ. 0.1 కోట్లు, కేరళలో రూ. 0.01 కోట్లు ఇలా ఇండియా వైడ్‌గా రూ. 8.85 కోట్ల గ్రాస్‌ను, రూ. 7.65కోట్ల నెట్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఇండియా వైడ్‌గా.. ఐదు రోజుల్లో కలిపి రూ.56.55 కోట్లు గ్రాస్, రూ.48.35కోట్ల నెట్ - ప్రపంచవ్యాప్తంగా రూ.68.55 నెట్ వసూలు చేసిందట.
లియో వసూళ్ల వివరాలిలా..
Leo Movie Day 5 Collections :దళపతి విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'లియో'. తాజాగా విడుదలైన ఈ సినిమా టాక్ పరంగా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ.. కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే 400 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన ఈ సినిమా.. ఐదవ రోజు సుమారు ఇండియాలో రూ. 35 కోట్ల (నెట్) వసూళ్లను అందుకున్నట్లు సమాచారం. తమిళనాడులో రూ. 26 కోట్లు, కేరళలో రూ. 7 కోట్లు, కర్ణాటకలో రూ.3 కోట్లు, ఏపీ, తెలంగాణలో రూ. 2.50 కోట్లు, మిగిలిన ప్రాంతాల్లో సూమారు రూ. 2.50 కోట్లను వసూలు చేసిందని సమాచారం.