Bhagavanth kesari vs Leo vs tiger nageswara rao Collections : 'భగవంత్ కేసరి, 'లియో', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు.. దసరా బరిలో నిలిచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కలెక్షన్ల పరంగాను ఈ సినిమాలు బాగానే వసూల్ చేస్తున్నాయి. పండగతో పాటు వీకెండ్ కూడా కావటం వల్ల ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే రన్ అయ్యాయి. అయితే ఇక నుంచి ఈ సినిమాలు అసలైన సవాల్ ఎదుర్కోనున్నాయి. అదేంటంటే?
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగిసిపోయాయి. దీంతో ఈ సినిమాలు ఏ మేరకు థియేటర్లలో రన్ అవుతాయో అనేది ప్రశ్నర్థకం. అయితే ఈ మూడింట్లో నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఆరు రోజుకు ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక మిగిలిన రెండు సినిమాలు మిక్స్డ్ టాక్‌తో రన్ అవుతున్నాయి. ఈ క్రమంలో బాలయ్య 'భగవంత్ కేసరి' మరో రెండు వారాల పాటు డీసెంట్ ఆక్యుపెన్సీతో రన్ కావొచ్చని టాక్. స్టార్ హీరో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా కూడా ఈ వీకెండ్లో బాక్సాఫీస్ వద్ద కొంత ఊపందుకుంది. అయితే కలెక్షన్ల పరంగా యావరేజ్ మార్క్ దక్కించుకోవాలంటే కొన్ని రోజుల వరుకు ఇలానే కొనసాగాలి.