తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Bhagavanth kesari trailer : స్టేజ్​పైనే శ్రీలీల కన్నీరు.. లైఫ్​లో మిస్సైన అనుభూతిని బాలయ్యే ఇచ్చారంటూ! - బాలయ్యపై శ్రీలీల కామెంట్స్​

Bhagavanth Kesari Trailer Sreeleela Emotional : నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్​లో హీరోయిన్ శ్రీలీల ఎమోషనల్​ అయింది. స్టేజ్​పై కన్నీరు పెట్టుకుని మాట్లాడింది. బాలయ్య గురించి మాట్లాడింది. ఆ వీడియో చూసేయండి..

Bhagavanth kesari trailer : శ్రీలీల ఎమోషనల్​.. 'లైఫ్​లో మిస్ అయిన అనుభూతిని బాలయ్య ఇచ్చారు!'
Bhagavanth kesari trailer : శ్రీలీల ఎమోషనల్​.. 'లైఫ్​లో మిస్ అయిన అనుభూతిని బాలయ్య ఇచ్చారు!'

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 9:25 PM IST

Updated : Oct 8, 2023, 10:27 PM IST

Bhagavanth Kesari Trailer Sreeleela Emotional :అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలయ్య 'భగవంత్ కేసరి'​ ట్రైలర్ వచ్చేసింది. ఈ ప్రచార చిత్రం లాంఛ్​ ఈవెంట్​ను వరంగల్​లో గ్రాండ్​గా నిర్వహించారు. ఎంతో పవర్​ఫుల్​గా అలాగే ఎమోషనల్​గా సాగిందీ ప్రచార చిత్రం. ఈ ప్రచార చిత్రంలో బాలయ్యతో పాటు శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. బాలయ్య ఎంత పవర్​ఫుల్​గా కనిపించారో.. శ్రీలీల అంతే ఎనర్జీతో పాటు ఎమోషనల్​గా కనిపించింది. సినిమాలో 'విజ్జి పాప'గా శ్రీలీల తన నటనతో ఆకట్టుకుంది.

అయితే ట్రైలర్ లాంఛ్​ ఈవెంట్​లో శ్రీలీల మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. స్టేజ్​పై లైట్​గా కన్నీళ్లు పెట్టుకుంది. మూవీటీమ్​తో సాగిన జర్నీని గుర్తుచేసుకుని ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు తెలిపింది. "ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను ఇక్కడికి. ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో సోల్​ కనెక్ట్ అ్యయే క్యారెక్టర్..​ నాకిచ్చిన అనిల్ రావిపూడికి స్పెషల్​ థ్యాంక్స్​. ఈ పాత్రకు నేను చాలా బాగా ఎమోషనల్​గా కనెక్ట్ అయ్యాను. నేను ఈ పాత్ర చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా లాస్ట్ సీన్​ కట్​ చెప్పాక అందులో నుంచి బయటకు రాలేకపోయాను. నా లైఫ్​లో ఏ అనుభూతిని అయితే నేను పొందలేదో ఆ అనుభూతిని ఈ సినిమా ద్వారా నాకిచ్చారు బాలయ్య గారు!" అంటూ శ్రీలీల ఎమోషనల్ అయింది.

Sreeleela Upcoming Movies : ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే.. పెళ్లి సందడితో టాలీవుడ్​కు పరిచయమైన ఈ భామ చేతిలో దాదాపు 10కి పైగా సినిమాలు ఉన్నాయి. తొలి చిత్రంతోనే అందం, నటనతో పాటు డ్యాన్స్​తోనూ ఆకట్టుకుంది. రీసెంట్​గా స్కంద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ.. అక్టోబర్ 19న భగవంత్ కేసరితో పలకరించనుంది. ఆ తర్వాత పంజా వైష్ణవ్​ తేజ్​తో స్కంద, నితిన్​తో ఎక్స్​ట్రా, సూపర్ స్టార్​ మహేశ్​ బాబుతో గుంటూరు కారం, పవన్ కల్యాణ్​తో ఉస్తాద్ భగత్‌సింగ్, అనగనగా ఒక రాజు.. ఇలా పలు చిత్రాలతో వరుసగా ప్రేక్షకులను పలకరించనుంది.

Bhagavanth Kesari Trailer : 'భగవంత్ కేసరి' బ్లాస్టింగ్​.. ఊహకందని రేంజ్​లో ట్రైలర్​ అప్డేట్​

Balakrishna Unstoppable 3 : ఓవైపు భగవంత్​ కేసరి.. మరోవైపు అన్​స్టాపబుల్​-3.. బాలయ్య ఫ్యాన్స్​కు డబుల్​ ట్రీట్​!

Last Updated : Oct 8, 2023, 10:27 PM IST

ABOUT THE AUTHOR

...view details