Bhagavanth Kesari Producers gifted car to Anil Ravipudi :నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రాధాన పాత్రలో నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. బాక్సాఫీసు వద్ద ఎవరూ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది ఈ చిత్రం. ఈ ఆనందంలో సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్.. దర్శకుడు అనిల్ రావిపూడికి టొయోటా వెల్ఫైర్ కారును బహుమతిగా అందించింది. షో రూమ్‌లో కారు కీని దర్శకుడికి ఇచ్చారు. ఈ మేరకు బ్లాక్‌బస్టర్ దావత్ అనే టైటిల్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
సందేశాత్మక చిత్రంగా రూపొందిన 'భగవంత్ కేసరి' తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ.. అమెజాన్‌లో టాప్‌లో కొనసాగుతోంది. తెలుగు వెర్షన్ మొదటి స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. హిందీ వెర్షన్ టాప్ 3లో నిలిచింది. అలాగే గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన చిత్రంగా భగవంత్ కేసరి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ అమెజాన్ పోస్టర్ విడుదల చేసింది.
వచ్చే ఏడాదే 'ఆదిత్య 369' సీక్వెల్!
ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది కోసం పెద్ద ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటున్నారు బాలకృష్ణ. ఎప్పటి నుంచో ఆయనకు మూడు కోరికలు ఉన్నాయట. వాటి కోసం ఆయన చాలా కాలం నుంచి గ్రౌండ్ వర్క చేస్తున్నారట. అందులో మొట్టమొదటిది 'ఆదిత్య 369'కి సీక్వెల్‌ను తెరకెక్కించడం. ముప్పై ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో అటు బాలయ్యతో పాటు ఇటు మూవీ లవర్స్ కూడా చాలా కాలంగా ఈ స్వీకెల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే 'భగవంత్ కేసరి' ప్రమోషన్లలో భాగంగా శ్రీలీల చేసిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఈ సీక్వెల్ గురించి మరింత క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌ను చాలా కాలం క్రితమే ఆయన తెరకెక్కించనున్నట్లు చెప్పారని తెలిపారు. ఇక 'ఆదిత్య 999' కథ సిద్ధంగా ఉందని.. ఒక రోజు రాత్రిలోనే ఈ స్టోరీని రెడీ చేసిన్నట్లు ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
'డీజే టిల్లు- స్క్వేర్' అప్డేట్ - రాధిక 'యాంథమ్' రిలీజ్!
ఓటీటీలోనూ దుమ్మురేపిన బాలకృష్ణ- గూగుల్‌లో 'భగవంత్ కేసరి' హవా!