Bhagavanth Kesari OTT : నందమూరి బాలకృష్ణ రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ 'భగవంత్ కేసరి'. అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమా.. దసరా విన్నర్‌గా నిలిచింది. టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ సినిమాను ఫ్యామిలి ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. నిర్మాతలు సాహు గరపాటి, హరీశ్ సంయుక్తంగా.. షైన్ స్ర్కీన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ 'భగవంత్ కేసరి' డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంది. దీంతో ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 24) అమెజాన్‌లో ప్రైమ్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాలయ్య కెరీర్లో ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా భగవంత్ కేసరి రూ. 140 కోట్లు వసూల్ చేసింది.
లియో ఓటీటీ.. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి - సూపర్ హిట్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం లియో. భారీ అంచనాల మధ్య గతనెల రిలీజైన ఈ సినిమా.. మిక్స్డ్ టాక్ పొందినప్పటికీ, కలెక్షన్లు సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక సీనియర్ హీరోయిన్ త్రిష.. ఈ సినిమాలో విజయ్‌కు జంటగా నటించింది. ఈ సినిమా కూడా నవంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.