Bhagavanth Kesari Movie Screening :నందమూరి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్, సోషల్ మెసేజ్ ఇలా అన్ని రకమైన ఎలిమెంట్స్ ఉండటం వల్ల మూవీ లవర్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇక 'భగవంత్ కేసరి'గా బాలయ్య అలరించగా.. విజ్జీ పాప పాత్రలో శ్రీలీల నటనకు ప్రశంసలు అందుకుంటోంది.
ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా అంటూ పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతుండగా.. వీకెండ్స్‌తో పాటు దసరా పండగ రోజు ఈ సినిమాకు వెళ్లే వారి సంఖ్య పెరగనుందని ట్రేడ్ వర్గాల టాక్. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు ఉన్న విపరీతమైన డిమాండ్ వల్ల రానున్న వీకెండ్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 అదనపు స్క్రీన్స్‌ను ఇవ్వనున్నారట. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Bhagavanth Kesari Cast : ఇక 'భగవంత్ కేసరి' సినిమా విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ భారీ యాక్షన్ మూవీలో బాలకృష్ణ, కాజల్‌తో పాటు శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ నటించారు. ఇందులో బాలకృష్ణ లుక్సే కాదు డైలాగ్స్ కూడా కొత్తగా ఉన్నాయి. తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్‌కు ఫ్యాన్స్ థియేటర్లలో విజిల్స్ మోత మోగించారు. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్‌ను అందించారు.