Bhagavanth Kesari Movie Collection :దసరా కానుకగా థియేటర్లలో విడుదలై సంచలనాలు నమోదు చేస్తోంది 'భగవంత్ కేసరి'మూవీ. 'ఆఖండ', 'వీరసింహారెడ్డి', తర్వాత బాలయ్యకు హ్యాట్రిక్ ఇచ్చింది ఈ సినిమా. రిలీజైన రోజు నుంచే సూపర్ హిట్ టాక్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసిన 'భగవంత్ కేసరి' ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఏడో రోజులోకి అడుగుపెట్టేసింది. అయితే వీకెండ్స్‌తో పాటు దసరా వేడుకల కారణంగా కలెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలా ఆరో రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 104 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మూవీ టీమ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కలెక్షన్ల పంట పండింది. నైజాంలో - రూ.13.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.95 కోట్లు, ఉత్తరాంధ్ర- రూ. 3.95cr, గుంటూరు- రూ. 5.18 కోట్లు, కృష్ణ- రూ. 2.68 కోట్లు, నెల్లూరు - రూ. 1.85 కోట్లు, ఈస్ట్ గోదావరి- 2.46 కోట్లు, వెస్ట్ గోదావరి- రూ. 2.28 కోట్లు, కర్ణాటక రూ. 3.9 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 0.5 కోట్లు, యూఎస్‌లో రూ. 6.5 కోట్ల కలెక్షన్లను అందుకుందని ట్రేడ్ వర్గాల టాక్ .
తాజాగా 'దంచవే మేనత్త కూతురా' పాటను రీ క్రియేట్ చేసి ఈ సినిమాకు జోడించారు. దీంతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. స్క్రీన్‌పై ఈ పాట వస్తే ఇక అంతే.. థియేటర్లలో ఫ్యాన్స్ ఈలలు డ్యాన్సులతో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ పాట సినిమాకు జోడించడం కాస్త ప్లస్ పాయింట్ అయ్యింది. తొలి సారి ఈ పాటను థియేటర్లో మిస్ చేసుకున్న ఫ్యాన్స్ రెండో సారి ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారట.