Bhagavanth Kesari 3 Weeks Collections : సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి - నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ కథానాయికగా, నటి శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో 21 రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
రూ.67.35 కోట్ల బిజినెస్..
'భగవంత్ కేసరి' తాజాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అధిగమించింది. ఈ మూడు వారాల్లో సినిమాకి నైజాంలో రూ.14.50 కోట్లు, సీడెడ్‌లో రూ.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.8 కోట్లు, తూర్పూ గోదావరిలో రూ.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.4 కోట్లు, గుంటూరులో రూ.6 కోట్లు, కృష్ణాలో రూ.4 కోట్లు, నెల్లూరులో రూ.2.60 కోట్లు, కర్నాటక సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో రూ.4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.6 కోట్లు. ఇవన్నీ కలిపి వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.67.35 కోట్ల బిజినెస్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
'భగవంత్ కేసరి'కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో రూ.18.36 కోట్లు, సీడెడ్‌లో రూ.13.96 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.6.29 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.3.30 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.2.71 కోట్లు, గుంటూరులో రూ.5.25 కోట్లు, కృష్ణాలో రూ.3.03 కోట్లు, నెల్లూరులో రూ.2.47 కోట్లు. మొత్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి.. రూ.55.37 కోట్ల షేర్లు, రూ.94.80 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.