సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు, కమెడియన్ దీపేశ్ భాన్ కన్నుమూశారు. దీపేశ్ భాన్ మృతి చెందిన విషయాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ కవితా కౌశిక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
క్రికెట్ ఆడుతూ.. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో స్నేహితులు ఆయనను హుటాహుటిన దగ్గర్లోని తరలించారు. అయితే అప్పటికే దీపేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
క్రికెట్ ఆడుతూ ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ బుల్లితెర నటుడు, కమెడియన్ దీపేశ్ భాన్ కన్నుమూశారు. అసిస్టెంట్ డైరెక్టర్ కవితా కౌశిక్.. దీపేశ్ మరణ వార్తను ధ్రువీకరించారు.
దీపేశ్ ఆకస్మిక మరణంతో టెలివిజన్ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీపేశ్ మృతి పట్ల పలువురు సినీ, టీవీ నటీనటులు సంతాపం ప్రకటిస్తున్నారు. దీపేశ్ చాలా ఫిట్‌గా ఉంటారని, మద్యపానం, పొగతాగే అలవాట్లు ఆయనకు లేవన్నారు కవితా కౌశిక్. అతనికి భార్య, కొడుకు ఉన్నారు. 'కాగా ‘భాబీ జీ ఘర్ పర్ హై' అనే సీరియల్‌తో పాటు 'కామెడీ కా కింగ్ ఖాన్', 'కామెడీ క్లబ్', 'భూత్‌వాలా', 'ఎఫ్‌ఐఆర్', 'ఛాంప్' వంటి షోలతో ఆయన మంచి గుర్తింపు పొందారు.
ఇదీ చదవండి:రూ.199 చెప్పులతో 'లైగర్' ట్రైలర్ లాంచ్‌కు హాజరైన విజయ్.. రణ్వీర్ పొగడ్తలు