తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రముఖ యువ నటి కన్నుమూత.. కారణం ఇదే! - ఆండ్రిలా శర్మ గుండెపోటుతో మృతి

ప్రముఖ బెంగాలీ యువ నటి ఆండ్రిలా శర్మ కన్నమూశారు. గుండెపోటుతో కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

Aindrila Sharma
ఆండ్రిలా శర్మ

By

Published : Nov 20, 2022, 4:03 PM IST

ప్రముఖ బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె ఇప్పటికే పలుమార్లు గుండెపోటుకు గురయ్యారు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. బ్రెయిన్ స్ట్రోక్​కు గురైన ఆండ్రిలా నవంబర్ 1న ఆస్పత్రిలో చేరారు. 24 ఏళ్ల ఆండ్రిలా ఇప్పటికే ఇంట్రాక్రానియల్ హెమరేజ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెతు ఇది వరకే ఈ వ్యాధికి సంబంధించిన సర్జరీ చేయాల్సి వచ్చింది.

ఆండ్రిలా శర్మ

నవంబర్ 14న పలుమార్లు ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పరిస్థితి విషమించడం వల్ల ఆసుపత్రిలోనే ఆండ్రిలా తుదిశ్వాస విడిచారు. ఒకరోజు ముందే అండ్రిలా శర్మ బాయ్‌ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి ఆమె బతకాలని ప్రార్థించమని సోషల్ మీడియాలో అభిమానులను కోరారు. బెంగాల్‌లోని బెర్హంపుర్‌లో ఆండ్రిలా పుట్టి పెరిగారు. ఆమె 'జుమూర్‌' షోతో టెలివిజన్​ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మహాపీఠ్, తారాపీఠ్, జిబోన్ జ్యోతి, జియోన్ కతి వంటి షోలలో నటించారు. ఆండ్రిలా అమీ దీదీ నంబర్ 1, లవ్ కేఫ్ వంటి సినిమాల్లో కూడా మెరిశారు.

ఆండ్రిలా శర్మ

ABOUT THE AUTHOR

...view details