తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలీవుడ్​లో బెల్లంకొండ శ్రీనివాస్​ సూపర్​​ రికార్డ్​.. ఏ హీరోకూ సాధ్యం కాని రేంజ్​లో! - బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకి నాయకా

టాలీవుడ్​ హీరో బెల్లంకొండ శ్రీనివాస్​ ఓ అదిరిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వివరాలు..

Bellamkonda Srinivas
బెల్లంకొండ శ్రీనివాస్​ అరుదైన​ రికార్డ్​

By

Published : Mar 28, 2023, 5:07 PM IST

Updated : Mar 28, 2023, 5:30 PM IST

'అల్లుడు శ్రీను' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి​​ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్​ బాబు వారసుడిగా చిత్రసీమలో అడుగుపెట్టి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి సినిమాతోనే సూపర్‌ హిట్​ను అందుకుని.. నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం ఆ జోరును కొనసాగించలేకపోయారు. అలా సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా, కాంట్రవర్సీల జోలికి పోకుండా సైలెంట్​గా తన పని తాను చేసుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తుంటారు. అయితే ఈ హీరోకి హిందీ యూట్యూబ్​లో మంచి మార్కెట్​ ఉంది. అక్కడి ఆడియెన్స్​కు బాగానే కనెక్ట్​ అయ్యారు. ఈయన సినిమాల హిందీ డబ్బింగ్​ వెర్షన్​లకు మంచి వ్యూస్​ వస్తుంటాయి.

అయితే తాజాగా ఈ హీరో నార్త్​లో ఓ అదిరిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డును ఈయన సొంతం చేసుకున్నారు. ఈయన ఊరమాస్ డైరెక్టర్​ బోయపాటి శ్రీనుతో.. 'జయ జానకి నాయక' సినిమా చేసిన సంగతి తెలిసిందే. 2017లో తెలుగులో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్​ టాక్​ను తెచ్చుకుంది. అయితే ఇదే చిత్రాన్ని హిందీలో పెన్​ మూవీస్​ యూట్యూబ్​​ ఛానల్​లో రిలీజ్ చేసింది. 'ఖూన్కార్' టైటిల్​తో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు అదిరిపోయే రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 709 మిలియన్​ వ్యూస్​ను దక్కించుకుంది. ఏ సినిమాకైనా 700 మిలియన్స్ వ్యూస్ రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. దీని తర్వాత కేజీయఫ్​ హిందీ వెర్షన్​ 702 మిలియన్ల వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఓ ట్వీట్​ వైరల్ అవుతోంది.

ఇకపోతే బెల్లంకొండ సాయి.. ఈసారి డైరెక్ట్​గా హిందీ బాక్సాఫీస్​ ముందు పోటీ పడటానికి సిద్ధమయ్యారు. తనకు తెలుగు డెబ్యూ ఇచ్చిన వీవీ వినాయక్ డైరెక్షన్​లో ప్రభాస్​ 'ఛత్రపతి' హిందీ రీమేక్​తో బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇది ఆయనతో పాటు వినాయక్‌కు తొలి హిందీ చిత్రం కావడం విశేషం. పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్​పై ధవల్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా సంయుక్తంగా నిర్మించారు. రీసెంట్​గా ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్​ కూడా విడుదలైంది. అందులో శ్రీనివాస్‌.. కండలు తిరిగిన బాడీతో.. ఓ చేతిలో రాగి చెంబు పట్టుకొని.. వీపుపై గాయాలతో కనిపించారు. ఒరిజినల్​ సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్‌.. ఈ రీమేక్​ కథకు రచయితగా వ్యవహరించారు. మే 12న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ హిందీ 'ఛత్రపతి' బెల్లంకొండకి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

బెల్లంకొండ శ్రీనివాస్​ అరుదైన​ రికార్డ్

ఇదీ చూడండి:'NTR​ 30' కోసం హాలీవుడ్​ టెక్నీషియన్స్​.. విజువల్​ ట్రీట్​పై స్పెషల్​ ఫోకస్​!

Last Updated : Mar 28, 2023, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details