తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

భారీ యాక్షన్ సీన్స్‌తో హిందీ 'ఛత్రపతి' ట్రైలర్​.. మీరు చూశారా? - బెల్లంకొండ శ్రీనివాస్​ హిందీ ఛత్రపతి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన హిందీ 'ఛత్రపతి' ట్రైలర్ రిలీజైంది. భారీ యాక్షన్ సీన్స్‌తో సాగిన ఈ ప్రచార చిత్రాన్ని మీరు చూశారా?

Bellamkonda  Hindi  chatrapati trailer released
భారీ యాక్షన్ సీన్స్‌తో హిందీ 'ఛత్రపతి' ట్రైలర్​.. మీరు చూశారా?

By

Published : May 2, 2023, 3:52 PM IST

Updated : May 2, 2023, 5:42 PM IST

డబ్బింగ్ సినిమాలతో నార్త్​ ఆడియెన్స్​లో కాస్త పాపులారిటీ సంపాదించుకున్నారు టాలీవుడ్ యంగ్​ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే ఈ సారి ఆయన 'ఛత్రపతి' హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. రెబల్​ స్టార్​ ప్రభాస్‌ - దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన టాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రమే 'ఛత్రపతి'. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఈ రీమేక్​ తెరకెక్కుతోంది. బాలీవుడ్ భామ నుస్రత్‌ బరూచా.. బెల్లంకొండ సరసన నటించింది. వేసవి కానుకగా మే 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే టీజర్​ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మూవీటీమ్​ ట్రైలర్​ను విడుదల చేసింది. భారీ యాక్షన్ సీన్స్‌తో సాగిన ఈ ప్రచార చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్​ వస్తోంది.

తెలుగు వెర్షన్‌ ఎలిమెంట్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా కాస్త నయా టచ్‌ ఇస్తూ.. స్టైలిష్‌ మాస్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో సినిమాను రూపొందించినట్లు ప్రచార చిత్రం చూస్తుంటే అర్థమవుతోంది. యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫైటింగ్స్, యాక్షన్ సీన్స్​లో బెల్లంకొండ బానే నటించారు. మొత్తంగా ఈ ప్రచార చిత్రం అవుట్ అండ్ అవుట్ పవర్ ప్యాక్డ్​గా రూపొందింది.

బాడీ పూర్తిగా ఛేంజ్​.. తెలుగులో ప్రభాస్ ఎలా అయితే కండలతో, ఫిట్​గా కనిపించారో.. హిందీ 'ఛత్రపతి' కోసం బెల్లంకొండ కూడా అలానే కనిపించారు. తన బాడీ మేకోవర్​ను పూర్తిగా మార్చేశారు. ఫుల్​గా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. కాగా, ఒరిజినల్ ఛత్రపతికి కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాదే.. ఈ రీమేక్​కు కూడా అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ‌రీ క‌మెడియ‌న్ జానీ లివ‌ర్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇంకా హీరో బెల్లంకొండ శ్రీనివాస్, నుస్రత్​ బరూచా, భాగ్యశ్రీతో పాటు అమిత్ నాయర్, సాహిల్ వైద్, శివమ్ పాటిల్, రాజేంద్ర గుప్తా, ఆశిష్ సింగ్ సహా పలువురు నటించారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ బ్యానర్​పై బాలీవుడ్ నిర్మాత జ‌యంతి లాల్ గ‌డా నిర్మించారు.

హిందీలో మంచి ఫాలోయింగే..బెల్లంకొండ శ్రీనివాస్​కు హిందీలో మంచి ఫాలోయింగే ఉంది. ఆయన హిందీ డబ్ సినిమాలకు యూట్యూబ్​లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఆ ధైర్యంతోనే హిందీ ఛత్రపతితో బాలీవుడ్ సిల్వర్​స్క్రీన్​పై అరంగేట్రం చేస్తున్నారు. రీసెంట్​గా ఆయన నటించిన 'జయ జానకి నాయక' సినిమా హిందీ వెర్షన్​ యుట్యూబ్​లో మంచి రికార్డు కూడా సాధించింది. ఈ మూవీకి హిందీలో 700 మిలియన్ల వ్యూస్​కు పైగా వచ్చాయి.

ఇదీ చూడండి:స్ప్రింగ్ సమ్మర్ స్టైల్​లో రష్మిక.. ప్రిన్సెస్​లా హనీ రోజ్​..

Last Updated : May 2, 2023, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details