'ఛత్రపతి' సినిమాతో బాలీవుడ్లో తొలిసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ రీమేక్‌తో హిందీ ఆడియన్స్‌ను ఖుషీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదివరకే శ్రీనివాస్ నటించిన పలు తెలుగు సినిమాలు హిందీలోకి అనువదించారు మేకర్స్. దీంతో నార్త్ ఇండియాలో కూడా ఆయన విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇదే క్రేజ్‌తో తన ఫస్ట్ హిందీ సినిమా ఛత్రపతితో మరింత మంది ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఛత్రపతి' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
'ఛత్రపతి'(హిందీ) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూడు రోజుల క్రితం ముంబయిలో టీజర్‌ను లాంచ్ చేసింది చిత్రబృందం. ఈ టీజర్‌కు నార్త్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే యూట్యూబ్‌లో 9.4 మిలియన్ల మంది చూశారు. ఈ వ్యూస్‌తో సినిమాకు మంచి ఓపెనింగ్స్ ఖాయమని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇకపోతే సినిమా ప్రచారం ముగించుకుని బెల్లంకొండ శ్రీనివాస్ ఆదివారం రాత్రి ముంబయి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయన రావడానికి ముందే భారీ పూలదండలు, పూల బొకేలతో విమానాశ్రయం వద్ద సందడి చేశారు ఫ్యాన్స్. శ్రీనివాస్ ఎయిర్‌పోర్టు లోపల నుంచి బయటకు రాగానే విజిల్స్, కేకలతో తమ హీరోకు గ్రాండ్‌గా వెలకమ్ పలికారు. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ కారులో ఇంటికి వెళ్లాడు శ్రీనివాస్. ఈ నీరాజనాలు చూస్తుంటే బెల్లంకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదుగా అనిపించక మానదు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న స్థాయిలో ఈయనకు అభిమానులు ఉన్నారంటూ నెటిజన్స్ అంటున్నారు.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో తెలుగులో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఈ మూవీని హిందీలో రిమేక్ చేయాలని అనుకున్నారు డైరెక్టర్ వి.వి.వినాయక్. హిందీలోనూ ఛత్రపతి పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా మే 12న థియేటర్లలో సందడి చేయనుంది.
2014లో విడుదలైన యాక్షన్ కామెడీ మూవీ 'అల్లుడు శీను'తో టాలీవుడ్లో అరంగేట్రం చేశారు నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్. స్పీడున్నోడు, జయ జానకి నాయకా, సీత, అల్లుడు అదుర్స్, సాక్ష్యం, రాక్షసుడు, కవచం వంటి సినిమాల్లో నటించి కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాప్‌లను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మరో సినిమాలోనూ నటిస్తున్నారు.