తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హిందీ 'ఛత్రపతి' టీజర్​ వచ్చేసింది.. ఎక్స్​పెక్టేషన్స్​ను రీచ్​ అయినట్టేనా? - ఛత్రపతి హిందీ రీమేక్​ టీజర్​

గతంలో ప్రభాస్​ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'ఛత్రపతి'. ఈ చిత్రాన్ని హిందీలో టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ రీమేక్​ చేస్తున్నారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్​ను విడుదల చేసింది మూవీటీమ్​. మీరు చూశారా?

Bellamkonda Srinivas Chatrapati hindi remake teaser
హిందీ 'ఛత్రపతి' టీజర్​ వచ్చేసింది.. ప్రభాస్​ను బెల్లంకొండ మ్యాచ్​ చేశాడా?

By

Published : Mar 30, 2023, 4:03 PM IST

Updated : Mar 30, 2023, 4:56 PM IST

పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ - దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన టాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం 'ఛత్రపతి'. ఈ చిత్రాన్ని హిందీలో టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రీమేక్​ చేస్తున్నారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్​గా ఫస్ట్​లుక్​ను కూడా విడుదల చేశారు. కండల తిరిగిన బాడీతో ఊరమాస్​గా బెల్లంకొండ కనిపించారు. దీనికి మంచి రెస్పాన్స్​ కూడా వచ్చింది. ఇప్పుడదే జోష్​తో మేకర్స్.. అభిమానుల్లో అంచనాలు పెంచేలా.. తాజాగా మరో కొత్త అప్డేట్​ ఇచ్చారు. 1.02 నిమిషాల నిడివి ఉన్న టీజర్​ను విడుదల చేశారు. ఈ మూవీ నిర్మాణ సంస్థ పెన్ మూవీ తన అధికారిక సోషల్​మీడియా అకౌంట్​లో షేర్ చేసింది. లైట్స్, కెమెరా, టూ మచ్ యాక్షన్ అని వ్యాఖ్య రాసుకొచ్చింది.

ఈ ప్రచార చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ తన యాక్షన్​తో అదరగొట్టేశాడనే చెప్పాలి. ఫైట్​ యాక్షన్ సీన్స్​లో తనలోని పూర్తి నటుడిని బయటకు తీశారు. తెలుగులో ప్రభాస్ నటించిన స్టైల్​లోనే నటించి ఆకట్టుకున్నారు. తనిష్క్ బాఘ్చి అందించిన మ్యూజిక్​, రవి బసూర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక ఇది చూసిన సినీ ప్రేక్షకులు, నెటిజన్లు.. శ్రీనివాస్ బాగానే సెట్ అయ్యారని అంటూ తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు. తెలుగులో ప్రభాస్ ఎలా అయితే కండలతో ఫిట్​గా కనిపించాడో.. ఇప్పుడదే తరహాలో శ్రీనివాస్​ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా బాగుందని అంటున్నారు. ఒరిజినల్​ సినిమాను మక్కీకి మక్కీ దింపినా.. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని చెప్పుకొస్తున్నారు. బెల్లంకొండ మంచి హిట్​ను అందుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్​ ఎవరనేది మేకర్స్​ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. టీజర్​లోనూ ఎక్కడా చూపించలేదు.

కాగా, 18 ఏళ్ల కిందట ఛత్రపతి సినిమా టాలీవుడ్​లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంతోనే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్​పై జయంతి లాల్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే టాలీవుడ్​లో ఆశించిన రేంజ్​లో హిట్​లను అందుకోలేకపోయారు బెల్లంకొండ. కానీ నటుడిగా మంచి పేరును తెచ్చుకున్నారు. దీంతో ఆయన హిందీలో మంచి హిట్​ను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

రీసెంట్​గా ఆయనఓ సూపర్​ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అదేంటంటే.. బెల్లంకొండకు హిందీ యూట్యూబ్​లో మంచి మార్కెట్​ ఉంది. ఈయన నటించిన సినిమాల హిందీ డబ్బింగ్​ వెర్షన్​లకు బాగా వ్యూస్​ వస్తుంటాయి. అలా బోయపాటి శ్రీను డైరెక్షన్​లో ఆయన నటించిన.. 'జయ జానకి నాయక' సినిమా 'ఖూన్కార్' టైటిల్​తో అక్కడ విడుదలైంది. ఈ చిత్రం ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 709 మిలియన్​ వ్యూస్​ను సాధించింది. వాస్తవానికి ఏ చిత్రానికైనా 700 మిలియన్స్ వ్యూస్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది.

ఇదీ చూడండి:Dasara movie: సుదర్శన్ థియేటర్​లో నాని సందడి.. ఫ్యాన్స్​ రచ్చ రచ్చ

Last Updated : Mar 30, 2023, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details