Chatrapathi Hindi Remake : తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'ఛత్రపతి' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ చిత్రం మే 12 శుక్రవారం విడుదల కానుంది. దీంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అని హీరోతో పాటు.. అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే, సాయి శ్రీనివాస్ ఇప్పటివరకు నటించిన సినిమాల హిందీ వర్షన్లకు యూట్యూబ్‌లో భారీ వ్యూస్ వచ్చాయి. బెల్లంకొండ యాక్షన్‌కు నార్త్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ఆయన నటించిన 'జయ జానకి నాయక' హిందీ వర్షన్‌కు యూట్యూబ్‌లో దాదాపు 710 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 'సీత' చిత్రానికి 588 మిలియన్, 'కవచం' సినిమాకు 340 మిలియన్, 'అల్లుడు శీను'కు 246 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ రికార్డులన్నీ బెల్లంకొండ 'ఛత్రపతి'కి కలిసి వచ్చే అవకాశాలున్నాయి.
అయితే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తెలుగు వర్షన్ 'ఛత్రపతి'ని టాలీవుడ్ అభిమానులు ఇదివరకే చూశారు. కాబట్టి తెలుగులో ఈ సినిమా అంతగా ఆడకపొవచ్చనేది సినీ నిపుణులు మాట. ఈ కారణంగానే మూవీ టీమ్ తెలుగు వర్షన్‌ను అంత సీరియస్ తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు, చిత్ర బృందం మెయిన్ టార్గెట్ కూడా హిందీ బాక్సాఫీసే అని సమాచారం. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. అంతమేరకైనా వసూళ్లు సాధిస్తుందా తేదా అని ఆసక్తి నెలకొంది. ఈ హిందీ 'ఛత్రపతి' సినిమాను.. గంగూభాయ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల నిర్మాతలు పెన్ స్టూడియోస్ విడుదల చేస్తున్నాయి. కాబట్టి ఎక్కువ మొత్తం థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశలున్నాయి. సినిమా టాక్ బాగుంటే భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.