Beast OTT release: ఉగ్రవాద నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం 'బీస్ట్'. మిశ్రమ స్పందనలను అందుకున్న ఈ చిత్రం ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. అన్ని భాషల్లోనూ మే 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు సన్నెక్ట్స్లోనూ రిలీజ్ కానుంది. కాగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించింది. అనిరూధ్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ నిర్మించింది.
Surya Bala movie shooting: తమిళ స్టార్ హీరో సూర్య.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ డైరెక్టర్ బాలాతో చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవడంతో.. ఈ సారి ఎలాంటి కథతో రాబోతున్నారు.. ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రీసెంట్‌గా కన్యాకుమారిలో షూటింగ్ మొదలైన ఈ సినిమా.. తాజాగా తొలి షెడ్యూల్‌ను 34 రోజుల్లో పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేసింది. రెండో షెడ్యూల్‌ను 15రోజుల పాటు గోవాలో చిత్రీకరించబోతున్నట్లు ప్రకటించింది. దీని కోసం భారీ సెట్ వేస్తున్నట్లు పేర్కొంది. ఇది పూర్తవ్వగానే షూటింగ్ ప్రారంభిస్తానని తెలిపింది. 'శివపుత్రుడు' లాంటి భారీ హిట్ తర్వాత సుమారు 18 ఏళ్ల అనంతరం మళ్లీ ఈ కాంబో కలిసి పని చేస్తోంది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించనుంది.
F3 venkatesh dubbing: 'ఎఫ్ 3' చిత్రం నుండి మరో అప్డేట్ వచ్చింది. ఇటీవలే మే 9న ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్రబృందం. అయితే తాజాగా ఈ ప్రచార చిత్రం కోసం హీరో వెంకటేశ్ తన డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్లు తెలిపింది. మే 9న 'ఫన్ బాంబ్ ఎఫ్ 3' ట్రైలర్ రాబోతుందని మరోసారి గుర్తుచేసింది. గతంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన 'ఎఫ్2'కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. మొదటి పార్ట్‌లో ఫ్యామిలీతో కలిగే ఫ్రస్టేషన్‌ను చూపించగా ఈ సారి మనీతో మనుషులకు కలిగే ఫ్రస్టేషన్‌ను 'ఎఫ్ 3' ద్వారా చూపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయ్యి రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే బయటకు వచ్చిన సాంగ్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై ఆసక్తి పెంచాయి. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. పూజాహెగ్డే స్పెషల్ సాంగ్‌లో చిందులేసింది. ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు.
Samantha Yashoda movie: దర్శక ద్వయం హరి అండ్ హరీశ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'యశోద'. సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 5వ తేదీన .. ఉదయం 11:07 నిమిషాలకు ఫస్టు గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మరోసారి గుర్తు చేసింది మూవీటీమ్. కాగా, ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో రావు రమేశ్, సంపత్ రాజ్, మురళీ శర్మ, ఉన్ని ముకుందన్ కనిపించనున్నారు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేంయనున్నారు.
ఇదీ చూడండి: 'మేజర్' అప్డేట్.. మహేశ్ చేతుల మీదగా 'జయమ్మ' కొత్త ట్రైలర్