తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Movies Updates: రవితేజ కోసం మెగాస్టార్​- 'బింబిసార' రిలీజ్​ డేట్​! - tiger nageswara rao movie launch

Movies Updates: దళపతి విజయ్​ హీరోగా తెరకెక్కిన బీస్ట్​ మూవీ ట్రైలర్​, నందమూరి కల్యాణ్​రామ్ 'బింబిసార' సినిమా రిలీజ్​కు సంబంధించిన అప్డేట్స్​ వచ్చేశాయి. 'టైగర్ నాగేశ్వర రావు', వలిమై సినిమాల విశేషాలు కూడా ఇందులో ఉన్నాయి.

Movies Updates
రవితేజ కోసం మెగాస్టార్​- 'బింబిసార' రిలీజ్​ డేట్​!

By

Published : Apr 1, 2022, 10:09 PM IST

Updated : Apr 1, 2022, 10:49 PM IST

Movies Updates: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయ్​ 'బీస్ట్​' ట్రైలర్​ శనివారం సాయంత్రం సాయంత్రం 6 గంటలకు రిలీజ్​ చేయనున్నారు. నెల్సన్​ దిలీప్​ కుమార్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్​పిక్చర్స్​ నిర్మించింది. అనిరూధ్​ రవిచందర్​ సంగీతం అందించారు. పూజా హెగ్డే హీరోయిన్​. ఏప్రిల్‌ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం.

నందమూరి కల్యాణ్​రామ్ హీరోగా తెరకెక్కిన 'బింబిసార' సినిమాకు సంబంధిన అప్డేట్​ వచ్చేసింది. మూవీ రిలీజ్​ తేదీని శనివారం ఉదయం 11:34 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టీజర్​ను బట్టి చూస్తే.. ఇందులోని విజువల్స్, వాయిస్ ఓవర్, ఎలివేషన్స్ సీన్స్​ అయితే అదిరిపోయే రేంజ్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

రవితేజ ప్రధాన పాత్రలో పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'టైగర్ నాగేశ్వర రావు' నుంచి అప్​డేట్ వచ్చింది. ఏప్రిల్ 2న ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమానికి మెగాస్టార్​ చిరంజీవి.. కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి హాజరుకానున్నట్లు చిత్రబృందం తెలిపింది. కథానాయికగా నుపూర్ సనన్​ నటించనుంది. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. 'ది కశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసర్' అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.

తమిళ స్టార్​ హీరో అజిత్‌ కథానాయకుడిగా హెచ్‌.వినోద్‌ తెరకెక్కించిన చిత్రం ‘వలిమై’. ఫిబ్రవరి 24న విడుదలైన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాకు ఓటీటీలో విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే స్ట్రీమింగ్​లో 500 మిలియన్ల నిమిషాల రికార్డును అధిగమించింది. ఈ సినిమాలో తెలుగు యువ కథానాయకుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు.

Last Updated : Apr 1, 2022, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details