తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బ్యాట్​మ్యాన్ స్వరం మూగబోయింది.. ఆయన ఇక లేరు - బ్యాట్​మెన్​ సిరీస్​ క్యారెక్టర్​ మృతి

హాలీవుడ్​ చిత్రం బ్యాట్​మ్యాన్ క్యారెక్టర్‌ను వాయిస్‌ ఓవర్‌ అందించిన కెవిన్ కాన్రాయ్ కన్నుమూశారు. తన గాత్రంతో ఎంతో మంది సినీప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన క్యాన్సర్​తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల అభిమానులు, సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Batman died
బ్యాట్​మెన్​ స్వరం మూగబోయింది

By

Published : Nov 12, 2022, 9:39 AM IST

Updated : Nov 12, 2022, 1:07 PM IST

డీసీ కామిక్స్‌లో బ్యాట్​మ్యాన్​కు ఉన్న క్రేజే వేరు. అయితే ఆ క్యారెక్టర్‌ను ఆడియెన్స్‌కు మరింత కనెక్ట్‌ చేసిన వ్యక్తి మాత్రం కెవిన్ కాన్రాయ్‌. గంభీరమైన స్వరంతో 'ఐ యామ్‌ వెన్‌జెన్స్‌.. ఐ యామ్‌ ది నైట్‌.. ఐ యామ్‌ బ్యాట్​మ్యాన్' అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడాయన ఇక లేరు. లోకం విడిచి వెళ్లిపోయారు.

బ్యాట్‌మెన్​ యానిమేటెడ్‌ సిరీస్‌లో బ్యాట్​మ్యాన్ క్యారెక్టర్‌కు వాయిస్‌ ఓవర్‌ అందించిన కెవిన్ కాన్రాయ్ కన్నుమూశారు. క్యాన్సర్ బాధపడుతున్న ఆయన.. 66 ఏళ్ల వయసులో న్యూయార్క్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులు, సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

1992-96 మధ్య కాలలో బ్యాట్​మ్యాన్ యానిమేటెడ్‌ సిరీస్‌లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో 15 చిత్రాలు, 400 టీవీ ఎపిసోడ్స్‌, 20కిపైగా వీడియోగేమ్స్‌, బ్యాట్​మ్యాన్:ఆర్ఖామ్‌ అండ్‌ ఇన్‌జస్టిస్‌ ఫ్రాంచైజీలకు వాయిస్‌ ఓవర్‌ అందించారు కాన్రాయ్‌. న్యూయార్క్‌ వెస్ట్‌బ్యూరీలో జన్మించిన కెవిన్‌ కాన్రాయ్‌.. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 1980 నుంచి టీవీ యాడ్స్‌ ద్వారా నటనలోకి అడుగుపెట్టి.. చాలాకాలం బుల్లితెర ప్రజలను అలరించారు. ఆపై కొన్ని చిత్రాలు, టీవీ సిరీస్‌ల్లోనూ మెరిశారు. 1991లో క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ ఆండ్రియా రొమానో ద్వారా బ్యాట్​మ్యాన్ సిరీస్‌కు వాయిస్‌ ఓవర్‌ అందించడం ప్రారంభించారు. కామిక్స్‌పై ఏమాత్రం అవగాహన లేని కాన్రాయ్‌.. బ్రూస్‌ వేన్‌(బ్యాట్​మ్యాన్) పాత్రకు తన గాత్రంతో జీవం పోశారు.

ఇదీ చూడండి:సంక్రాంతి బరిలో బాలయ్య, చిరు.. విడుదల విషయంలో అయోమయం

Last Updated : Nov 12, 2022, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details