Balakrishna vs Raviteja :నందమూరి బాలకృష్ణ - మాస్ మహారాజా రవితేజ మధ్య చాలా కాలంగా బాక్సాఫీస్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరు చాలా సార్లు పోటీపడ్డారు. అయితే ఈ ఇద్దరు పోటీపడిన ప్రతీసారి రవితేజదే పైచేయి నడిచింది! కానీ ఈ సారి లెక్క మారింది. కథ రివర్స్ అయింది. బాక్సాఫీస్ వద్ద టైగర్ నాగేశ్వరరావుపై భగవంత్ కేసరి గెలిచిండు అనే మాటలు వినిపిస్తున్నాయి.
రవితేజ హీరో అవ్వకముందే.. బాలయ్య స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్లను అందుకున్నారు. ఆ తర్వాత మాస్ మాహారాజా హీరోగా మారి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాక కూడా బాలయ్య ఎన్నో సక్సెస్లను చూశారు. అయితే వీరిద్దరు పోటీ పడినప్పుడు మాత్రం రవితేజనే డామినేషన్ చూపించేవారు. 2008 సంక్రాంతి బరిలో బాలయ్య ఒక్కమగాడుతో.. రవితేజ కృష్ణతో పోటీ పడగా.. మాస్ మహారాజా సినిమానే సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. 2011లో పరమవీరచక్ర - మిరపకాయ్ విడుదల కాగా.. మళ్లీ రవితేజ చిత్రమే సక్సెస్ అందుకుంది. మిత్రుడు, కిక్ చిత్రాలు కాస్త గ్యాప్‌లో రిలీజైనప్పుడు కూడా బాలయ్య చిత్రమే నిరాశపరిచింది. అలా పలుసార్లు రవితేజనే పైచేయి సాధించారు.