యంగ్ హీరోలకు పోటీనిస్తూ మాస్ యాక్షన్ సినిమాలతో పూనకాలు తెప్పిస్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. గతేడాది 'అఖండ' సినిమాతో సూపర్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకొని రికార్డులు తిరగరాసిన బాలయ్య .. ఇప్పుడు మరో మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ అభిమానుల చేత గోల పెట్టించే డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి 'వీర సింహారెడ్డి'గా కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ అప్డేట్స్ అభిమానుల్లో పూనకాలు తెప్పించాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సూపర్ సర్ప్రైజ్ వచ్చింది. సినిమాలోని 'సుగుణ సుందరి' అనే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు ఊహించని కిక్ ఇచ్చారు మేకర్స్. ఉర్రూతలూగించే ఈ లిరికల్ వీడియో సాంగ్‌లో బ్యూటీ శ్రుతిహాసన్‌తో కలిసి బాలయ్య బాబు వేస్తున్న మాస్ స్టెప్స్ పిచ్చెక్కిస్తున్నాయి. తమన్ బాణీలకు బాలయ్య అదిరిపోయే చిందులు వేశారు. కాసేపట్లోనే ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసేసింది.