తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న 'వీరసింహారెడ్డి'.. ఐదు రోజుల్లో ఎంతంటే? - బాలయ్య మూవీ వసూళ్లు న్యూస్

నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అంచనాలకు మించి అందుకుంటోంది. ఇప్పుటివరకు ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎంత కలెక్ట్ చేసిందంటే?

Balakrishna Veerasimhareddy
వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణ

By

Published : Jan 17, 2023, 1:02 PM IST

Updated : Jan 17, 2023, 8:06 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'వీర సింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూసిన అభిమానులు హుషారెత్తిపోతున్నారు. వెండితెరపై బాలయ్యను చూసి పూనకాలెత్తిపోతున్నారు. మొదటిరోజే సంచలన వసూళ్లు సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల జోరును ఇంకా కొనసాగిస్తోంది. ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.115 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 53.42కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలిసింది.

నిజాం : రూ. 14.42 కోట్లు

సీడెడ్ : రూ. 14.5 కోట్లు

యూఏ : రూ. 5.25 కోట్లు

ఈస్ట్ : రూ. 4.05 కోట్లు

వెస్ట్ : రూ. 3.35 కోట్లు

గుంటూరు : రూ.5.55 కోట్లు

కృష్ణ : రూ. 3.60 కోట్లు

నెల్లూరు : రూ. 2.30 కోట్లు

మొత్తం ఏపీ, తెలంగాణలో : 53.42కోట్లు

కాగా, వీరసింహారెడ్డిలో బాల‌కృష్ణ యాక్టింగ్‌, యాక్ష‌న్ సీక్వెన్స్ అభిమానుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. బాలయ్య సరసన శృతిహాస‌న్‌, మలయాళీ భామ హ‌నీ రోజ్ హీరోయిన్లుగా న‌టించారు. బాల‌కృష్ణ సోద‌రిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ న‌టించింది. దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టించారు. తమన్ సంగీతం అందించారు.

Last Updated : Jan 17, 2023, 8:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details